ప్రభాస్‌ ‘బాహుబలి’ పారితోషికం?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ తర్వాత చేస్తున్న చిత్రం ‘బాహుబలి’.‘మిర్చి’ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ పారితోషికం అమాంతం పెరిగేది.

 Prabhas Remuneration 37 Crores For Baahubali-TeluguStop.com

అయితే రెండు సంవత్సరాలుగా ప్రభాస్‌ ‘బాహుబలి’కే పరిమితమై ఉన్నాడు.దాంతో ఈయన ‘మిర్చి’ సక్సెస్‌ను క్యాష్‌ చేసుకోలేక పోతున్నాడు అని ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు అనుకుంటున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ రెండు పార్ట్‌లకు కలిపి ప్రభాస్‌ రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మొదట ప్రభాస్‌ పారితోషికం రెండు పార్ట్‌లకు కలిపి 20 కోట్లుగా ప్రచారం జరిగింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ ‘బాహుబలి’ పారితోషికం తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలో దక్కినట్లుగా తెలుస్తోంది.తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ దాదాపుగా 27 కోట్లు ఉంటుంది.

ఇక మరో 10 కోట్లు ప్రభాస్‌కు అదనంగా నిర్మాతలు అందించారు.ఇలా మొత్తంగా ప్రభాస్‌కు ‘బాహుబలి’ రెండు పార్ట్‌లకు కలిపి 37 కోట్ల పారితోషికం అందినట్లుగా తెలుస్తోంది.

ఈ పారితోషికం చిన్న మొత్తం ఏం కాదు.ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఇంత భారీ పారితోషికం తీసుకున్నది లేదు.

రెండు సంవత్సరాలుగా ప్రభాస్‌ పడుతున్న కష్టానికి ఇది తక్కువ పారితోషికమే అంటున్నారు ఆయన అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube