అవి పుకార్లే.. కట్టప్ప ఆరోగ్యం గురించి అసలు విషయాలు బయటకు వచ్చాయి

బాహుబలి స్టార్‌ కట్టప్ప సత్యరాజ్‌ ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈమద్య కాలంలో చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడ్డట్లుగానే ఆయన కూడా కరోనా బారిన పడ్డాడు.

 Baahubali Star Kattappa Satyaraj Health News , Baahubali, Satyaraj , Health News , Kattappa , Tollywood , Kollywood ,-TeluguStop.com

ఆయన వయసు ఎక్కువ కారణంగా వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.

ఆయన ఆరోగ్యం విషయమై మీడియాలో ముఖ్యంగా సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆయన శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.

 Baahubali Star Kattappa Satyaraj Health News , Baahubali, Satyaraj , Health News , Kattappa , Tollywood , Kollywood , -అవి పుకార్లే.. కట్టప్ప ఆరోగ్యం గురించి అసలు విషయాలు బయటకు వచ్చాయి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల ఒక తమిళ ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో సత్యరాజ్‌ లంగ్స్ ఇన్ఫెక్ట్‌ అయ్యాయి.దాంతో ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది అన్నట్లుగా రాశారు.

వారి రాతలతో సత్యరాజ్ ఫ్యామిలీ స్పందించారు.ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని తెలియజేశారు.

మరో గుడ్‌ న్యూస్ ఏంటీ అంటే ఆయన కరోనా పాజిటివ్‌ నుండి ఇప్పుడు నెగటివ్‌ అయ్యాడు.ఆయన మరో వారం రోజులు విశ్రాంతి తీసుకుని షూటింగ్ కు కూడా జాయిన్‌ అవుతాడు.

తెలుగు లో ఆయన నటించే సినిమా లకు గాను వచ్చే నెలలో షూటింగ్ కు హాజరు అవుతాడు అంటున్నారు.సత్యరాజ్ తో మాట్లాడిన వారు చాలా మంది ఆయన మునుపటి ఉత్సాహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఆసుపత్రి నుండి కూడా నేడో రేపో బయటకు వస్తాడని అంటున్నారు.

బాహుబలి తర్వాత దేశ వ్యాప్తంగా ఆయన కు మంచి గుర్తింపు దక్కింది.అందుకే ఆయన ఏడాదికి పది పదిహేను సినిమా ల్లో నటిస్తున్నాడు.తెలుగు లో ప్రస్తుతం ఈయన రెండు మూడు సినిమా లు చేస్తున్నాడని తెలుస్తోంది.

సత్యరాజ్ ఆరోగ్యం విషయంలో కొందరు చేస్తున్న ప్రచారం నమ్మకుండా ఆయన హెల్త్‌ గురించి ప్రార్థించండి అంటూ ఆయన సన్నిహితులు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube