ఆర్ఆర్ఆర్‌ ట్రైలర్ కు 'బాహుబలి' సెంటిమెంట్‌.. రచ్చ రచ్చ ఖాయం

Baahubali Sentiment For Rrr Movie

టాలీవుడ్‌ జక్కన్న సినిమా లు మాత్రమే భారీగా ఉండవు.ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగా ఉంటాయి.

 Baahubali Sentiment For Rrr Movie-TeluguStop.com

ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.అద్బుతమైన ప్రమోషన్ టెక్నిక్స్ ఆయన టీమ్‌ వద్ద ఉంటాయి అనడంలో సందేహం లేదు.

ఆయన తనయుడు కార్తికేయ పబ్లిసిటీ విషయంలో తల పండి పోయాడు.రాజమౌళి ప్రతి సినిమా ను కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్‌ చేయడంలో వారికి వారే సాటి అనడంలో సందేహం లేదు.

 Baahubali Sentiment For Rrr Movie-ఆర్ఆర్ఆర్‌ ట్రైలర్ కు బాహుబలి’ సెంటిమెంట్‌.. రచ్చ రచ్చ ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అద్బుతమైన పబ్లిసిటీతో పాటు ప్రతి ఒక్కరికి చేరువ అయ్యేలా సినిమా ను తీసి ప్రచారం చేయడం ఆయనకే చెల్లింది.రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ప్రారంభించి మూడు ఏళ్లు అవుతుంది.

కరోనా వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.బాహుబలి రేంజ్ సినిమా ఇది అంటున్నారు.

బడ్జెట్‌ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా బాహుబలిని మించిన సినిమా అనిపిస్తుంది.

ఇక వసూళ్ల విషయంలో బాహుబలిని క్రాస్‌ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుందని కొందరు సెంటిమెంట్‌ చెబుతున్నారు.

ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ట్రైలర్ ను థియేటర్ ల ద్వారా స్క్రీనింగ్‌ చేయబోఉన్న విషయం తెల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలోట్రైలర్‌ ను స్క్రీనింగ్‌ చేయడం కోసం సెన్సార్ కూడా చేయించారు.

గతంలో బాహుబలి సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను కూడా స్క్రీనింగ్‌ చేశారు.ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను కూడా స్క్రీనింగ్‌ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సెంటిమెంట్‌ ప్రకారం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అంటున్నారు.థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ చేయడం కేవలం రాజమౌళికి చెల్లింది.ఆయన అద్బుతమైన ఫాలోయింగ్‌ మరియు ఆయన యొక్క పని తనం పై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది.అందుకే ఈ సినిమా ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

#Ajay Devgan #Aliabhatt #Rajamouli #RRR Trailer #Ramcharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube