5వేల థియేటర్లలో ‘బాహుబలి’ మళ్లీ...!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా జులై 10న ప్రంపచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైన విషయం తెల్సిందే.సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సినిమాను మరోసారి 5000 థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Baahubali Release 5000 Theaters Again-TeluguStop.com

చైనాలో ఈ సినిమాను ఒక సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు భారీ మొత్తం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

చైనాలో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న ‘పీకే’ను ఆదర్శంగా తీసుకుని ‘బాహుబలి’ కూడా భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రాల ఎడిటర్‌ విన్సెంట్‌ ఈ సినిమాను ట్రిమ్‌ చేయడం జరిగింది.నిర్మాతలు ప్రస్తుతం చైనాలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మరింతగా కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.‘పీకే’ చైనా రికార్డులను ‘బాహుబలి’ బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అంటున్నారు.

త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube