పుట్టిన 18 రోజులకే రాజమౌళి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న చిన్నారి…  

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి” చిత్రం అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన రికార్డులు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.

TeluguStop.com - Baahubali Movie Child Artist Akshara News

ఈ చిత్రం రికార్డుల పరంగానే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ గురించి ప్రపంచానికి తెలియచేసింది.అంతేగాక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయింది.

అయితే ఈ చిత్రంలో బాహుబలి చిన్నప్పుటి పాత్రలో నటించిన చిన్నారి గురించి చాలా మందికి తెలియదు.అయితే ఆ  చిన్నారి ఎవరంటే ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నటువంటి  విల్సన్ కూతురు.

TeluguStop.com - పుట్టిన 18 రోజులకే రాజమౌళి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న చిన్నారి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ చిన్నారి పేరు అక్షర. అయితే విల్సన్ ఈ  చిత్ర షూటింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్న సమయంలో జన్మించింది.దీంతో ఆమెని చూడటానికి రాజమౌళి వెళ్ళాడట. ఆ తర్వాత తన బాహుబలి చిత్రంలో అక్షర ని నటింపజేయాలని అడగడంతో విల్సన్  రాజమౌళి మాట కాదనలేక అక్షరని చిన్న బాహుబలి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు.

అక్షర పుట్టిన 18 రోజులకే  ఎస్ఎస్ రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి ఆర్.

ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదితరులు హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించినప్పటికీ ప్రస్తుతం కరుణ వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

 దీంతో ఈ చిత్ర విడుదల కూడా ఆలస్యం అయ్యేలా ఉంది.

#TeluguChild #BahubaliMovie #Akshara #Bahubali #SS Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Baahubali Movie Child Artist Akshara News Related Telugu News,Photos/Pics,Images..