హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందం ఆ ఐటెం బాంబ్ సొంతం...!

ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో సినిమాలో కచ్చితంగా కనీసం ఒక్క మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అన్నట్లుగా సాగిపోతోంది.హిందీ, తెలుగు, తమిళ, కన్నడ ఏ విష్యం తీసుకున్నా సరే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి అందులో ఐటమ్ సాంగ్స్ తీసేస్తున్నారు.

 Baahubali Manohari Song Fame Nora Fatehi About Movie Offers, Nora Fatehi, Bollyw-TeluguStop.com

ఐటమ్ సాంగ్స్ కోసం కొంతమందిని అదేపనిగా బొంబాయి నగరంలో మోడలింగ్ చేసే కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో నటింప చూపిస్తున్నారు.అయితే ఈ మధ్య ప్రేక్షకుల అటెన్షన్ కోసం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ చేయడానికి తీసుకుంటున్నారు.

ఇలా చేయడంతో కేవలం కొంతమంది ఐటమ్ సాంగ్స్ కోసమే ఆడియన్స్ థియేటర్స్ కు రావడం గమనిస్తూనే ఉంటాం.

ఇదివరకు కాలంలో జయమాలిని, జ్యోతి లక్ష్మి.

ఇలా కొంతమంది స్పెషల్ సాంగ్స్ కోసం కనబడేవారు.అయితే ఆ తర్వాతి కాలంలో రానురాను ఈ పద్ధతి పూర్తిగా మారిపోయింది.

ఒక సినిమాలో హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఎంచుకునే హీరోయిన్ సంగతి కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దర్శకనిర్మాతలు.అయితే ఈ విషయంలో మాత్రం కొంత మంది స్టార్ హీరోయిన్స్ కి దర్శకనిర్మాతలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి చేపించుకుంటున్నారు.

ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్, తమన్నా, శృతిహాసన్… లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ లో నటించేస్తున్నారు.అయితే ఇదంతా కేవలం ప్రేక్షకుల అటెన్షన్ కోసమే అని తెలిసిందే.

అయితే ఇలా ఐటమ్ సాంగ్స్ సెలక్ట్ చేసే ముందు హీరోయిన్స్ కాకుండా ఎవరినైనా మోడల్ తీసుకువచ్చిన నటింపచేసేవారు.అయితే ఇందులో కొంత మంది అసలు ఏమాత్రం హీరోయిన్ కు తీసిపోకుండా ఉంటారు.

అయితే ఇలా ఉన్నవారిలో ఇదివరకు బాహుబలి సినిమాలో మనోహరి అనే సాంగులో ఓ టాప్ మోడల్ నోరా ఫతేహి అందరికీ గుర్తుండే ఉంటుంది.అందులో ముగ్గురు భామలు నటింపజేసి మెప్పించినా… నోరా ఫతేహి మెప్పించినంతగా మిగతా ఇద్దరు కూడా పాపులారిటీని సంపాదించక లేకపోయారు.

కాకపోతే ఈ భామ లోఫర్, టెంపర్ లాంటి సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలలో నటించింది.అయితే ఆమె అందం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నా కానీ ఎందుకో మరి దర్శకనిర్మాతలకు ఆమెను హీరోయిన్ గా తీసుకొనే ఇంట్రెస్ట్ చూపట్లేదు.

చూడాలి మరి ఇక ముందర ఏమైనా ఈవిడను కేవలం ఐటం బాంబు గానే పరిగణిస్తారో లేకపోతే వెండితెరపై హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube