డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎక్కడ జరగనుందంటే?

ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక పేరు కాదు ఒక బ్రాండ్ లా మారిపోయింది.ఇప్పుడు బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పవచ్చు.

 Rumors On Hero Prabhas Marriage Place, Prabhas, Prabhas Marriage In Foreign, Pra-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభాస్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలికి తరువాత ప్రభాస్ అని మనం చెప్పక తప్పదు.ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరని అంటే ఎవరి నుంచైనా ఠక్కున వచ్చే సమాధానం ప్రభాస్.

ఇప్పటి వరకు ప్రభాస్ కు తోడుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ గా ఉన్న రాణా, నితిన్ సైతం పెళ్లిబాజాలు మోగించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జాబితా నుండి వెళ్లిపోయారు.కాని ప్రభాస్ మాత్రం గత కొన్నేళ్లుగా అభిమానులను ఊరిస్తూ, పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నను చాకచక్యంగా దాట వేస్తూ అభిమానులను ఊరిస్తున్నాడు.

అయితే ఇటీవల ప్రభాస్ అమెరికా కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొనున్నట్లు వార్తలు వినిపించాయి.

Telugu America, Nag Ashwin, Prabhas, Prabhas Foreign, Rumors, Rumorsprabhas, Sal

అయితే ఈ విషయాన్ని ప్రభాస్, ప్రభాస్ సన్నిహితులు కూడా ఖండించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరాయి.అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్ళికి సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది.ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేసే సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం ఇండియాలో కాక ఫారన్ లో చేసుకొనున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇక్కడ అభిమానుల తాకిడి, అదే విధంగా వేలాది మంది వచ్చే అవకాశం ఉండడంతో, ఫారన్ లో అయితే ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పెళ్లి ఫారన్ లో చేసుకొని రిసెప్షన్ మాత్రం ఇండియాలో నిర్వహించే అవకాశం తెలుస్తోంది.అయితే ఈ వార్తలు పుకార్లా, ఇందులో ఏదైనా వాస్తవం ఉందా తెలియాలంటే ప్రభాస్ సన్నిహితులు ధ్రువీకరిస్తేనే తెలిసే అవకాశం ఉంది.

అయితే అభిమానులు మాత్రం ఈ వార్తలను ప్రభాస్ సన్నిహితులు ఎవరు ఖండించడం లేదు కాబట్టి వార్తలను బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube