మరో బాహుబలి కాబోతున్న ఫైటర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ఇప్పటికే షూటింగ్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.

 Fighter Movie To Be Another Baahubali, Baahubali, Fighter, Vijay Devarakonda, Pu-TeluguStop.com

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో పలువురు క్రేజీ నటీనటులు నటిస్తున్నారు.

ఈ క్రమంలో ఫైటర్ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆమె నార్త్‌లో పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే బాహుబలి చిత్రంతో ఆమె ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించుకుంది.

అయితే బాహుబలి ఇచ్చిన గుర్తింపు తనకు ఫైటర్ చిత్రం ఇస్తుందని ఆమె ఆశిస్తుంది.

పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథ తనకు చెప్పినప్పుడు ఇది కూడా బాహుబలి స్థాయి చిత్రంగా ఉండబోతుందని ఆమె అనుకుని వెంటనే ఈ సినిమాను ఓకే చేసిందట.

ఈ సినిమా స్క్రిప్టు పరంగా యూనివర్సల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాలో తన పాత్ర కూడా ఆమెకు మంచి పేరును తీసుకొస్తుందని ఆమె భావిస్తోంది.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube