జాతీయ అవార్డుకి బాహుబాలి అర్హత ఏంటి ?

మాయబజార్ కి ఆ గౌరవం దక్కలేదు.శంకరాభరణం, స్వాతిముత్యం,సాగర సంగమం .

 Baahubali Deserves National Award?-TeluguStop.com

ఇలా కొన్ని చిత్రాలు చూపరులని ఆకట్టుకోవడమే కాకుండా అలోచనలో పడేసాయి.జాతీయవ్యాప్తంగా సినీవిమర్శకుల దృష్టి తెలుగు చిత్రాల మీద పడేసేలా చేసాయి.

గొప్ప చిత్రాలు, క్లాసిక్స్ , ఎవర్ గ్రీన్ చిత్రాలు .ఇలా ఎన్ని మాటలైనా సరిపోవు.మరి అలాంటి చిత్రాలకి దక్కని జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు బాహుబలికి దక్కింది.వాటిలో లేనిదేంటి … బాహుబలిలో ఉన్నదేంటి! గ్రాఫిక్స్ మాత్రం అనకండి .ఎందుకంటే గ్రాఫిక్స్ ఎప్పుడూ ఉత్తమ చిత్రానికి కొలత కాదు

ఒకవర్గం వాదనేంటంటే .బీజేపి ప్రభుత్వం వల్లే వచ్చిందట.బీజేపికి బాహుబలికి లింక్ ఏంటి అనేది మనకు అర్థం కాని విషయమే.అది పక్కన పెడదాం.గత ఏడాది మంచి చిత్రాలు లేవా అంటే అదీ కాదు … బాజిరావు మస్తాని,తల్వార్,మసాన్,ప్రేమమ్,కంచే… ఇంకా చెప్పుకుంటూపోతే ఓ పదైనా ఉంటాయి

బాహుబలి గొప్ప చిత్రం .అందులో సందేహమే లేదు.కాని బాహుబాలి అనేది పూర్తి చిత్రం కాదు.సగం కథ మొదటిభాగంలో, మరోసగం రెండొవభాగంలో ఉంది.మరి అసంపూర్తిగా ఉన్న సినిమాని జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు.ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి కాబట్టి ఎంకరేజ్ చేసారా? లేక కళ కన్నా ఏదో కలలాగా అనిపించిన బాహుబలికి ఆకర్షితులైపోయారా ?

తెలుగువాళ్ళందరికి గర్వకారణం బాహుబలి ఈ విజయాన్ని సాధించడం .కాని ఏదో మూల ఒక చిన్ని ప్రశ్న .బాహుబలి కన్నా పెద్ద సినిమాలు మనవాళ్ళు ఇప్పటివరకు తీయలేదు కాని బాహుబలి కన్నా గొప్ప సినిమాలు చాలానే తీసారు కదా అని

రావాల్సిన వాటికి రాలేదని బాధపడి ప్రయోజనం లేదు … తెలుగు సినిమాను సింహాసనం మీద కూర్చోబెట్టిన రాజమౌళికి సలామ్ కొడదాం!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube