బాలయ్య కోసం లాక్ చేసిన డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు బాలయ్య.

 B Gopal Locks Story For Balakrishna-TeluguStop.com

ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్న బాలయ్య, అదిరిపోయే కథతో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

 B Gopal Locks Story For Balakrishna-బాలయ్య కోసం లాక్ చేసిన డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్యకు గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత బుర్ర సాయి మాధవ్ ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేశాడట.

ఒక్కసారి బాలయ్య ఈ కథను ఓకే చేస్తే, వెంటనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి బాలయ్య ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#NBK107 #B Gopal #Boyapati Srinu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు