బి అలర్ట్: దయచేసి ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!

టెక్నాలజీ పెరిగిపోతున్నకొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా అదేవిధంగా జరుగుతున్నాయి.ఈజీగా డబ్బుని సంపాదించాలనే నెపంతో కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు.

 B Alert: Please Don't Pick Up Calls From These Numbers Mobile Users, Alert, Tech-TeluguStop.com

మసిపూసి మారేడుకాయ చేసి కోట్లలో డబ్బుని దొంగిలిస్తున్నారు.ఈ క్రమంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం ఎక్కువైంది.

చాలా మంది తెలియక ఆ ఫోన్లను లిఫ్ట్ చేస్తున్నారు.ఇంకేముంది.

కట్ చేస్తే ఫోన్ ఎత్తిన వారి అకౌంట్లలో నుంచి డబ్బులు మాయం అవుతున్నాయి.లేదంటే వారి సమాచారం మొత్తం హ్యాక్ కు గురైతుంది.

సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని పక్కదారి పట్టించి ఇలా కాల్స్ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టెలికాం శాఖ అలర్ట్ ప్రకటించింది.వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని చెబుతోంది.+1 ,+92 ,+968 ,+44 ,+473 , +809, +900తో ప్రారంభమయ్యే సంఖ్యల నుండి ఫోన్ కాల్స్ వచ్చినా లేదా వాట్సాప్ కాల్స్ వచ్చినా ఎట్టి పరిస్థితులలో లిఫ్ట్ చేయొద్దని తెలిపింది.మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో ఐనా సరే ఈ నంబర్స్ తో కాల్స్ వస్తే ఎత్తొద్దని టెలికాం శాఖ చెప్పడం గమనార్హం.చాలా మంది కేటుగాళ్లు కాల్స్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేస్తున్నారు.సదరు వ్యక్తి మహిళ అయితే బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

అలాగే వారి ఖాతాలలో నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా చేస్తున్నారు.తాజా సర్వేలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని తేలింది.

అందుకే టెలికాం శాఖ ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని హెచ్చరిస్తోంది.కాగా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రజలలో ఈ నంబర్ల పై అవగాహన కల్పించింది.

ఒకవేళ మీరు ఈ సమాచారాన్ని మిస్ అయితే ఇక్కడ చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube