పనికిరాని వాహనాలతో ఈ-బైక్‌ లను తయారుచేస్తున్న మూడో క్లాసు చదువుకున్న వ్యక్తి..!  

Azamgarh engineer Re models Od Bike to E Bike, Old Bikes, E bike, Uttar Pradesh, Saleem, Third class Graduate - Telugu Azamgarh Engineer Re Models Od Bike To E Bike, E Bike, Old Bikes, Saleem, Third Class Graduate, Uttar Pradesh

ఎవరైనా వాహనాన్ని బాగా వాడేసి చివరికి అవి నడపడానికి పనికి రాకపోతే పక్కన పడేయడం లేకపోతే దానిని తుక్కు కింద అమ్మేయడం చేస్తుంటారు.ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్‌గఢ్ కు చెందిన వ్యక్తి పూర్తిగా పాడు అయిపోన బైకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఈ బైక్ గా తయారు చేసి విక్రయిస్తున్నాడు.

TeluguStop.com - Azamgarh Engineer E Bike Old Vehicles

సలీం అనే వ్యక్తి ఎటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకలేకపోయినా అతని ప్రతిభ మాత్రం పెద్దపెద్ద ఇంజనీర్లకు సమానంగా ఉండేలా ప్రతిభను చాటుకున్నాడు.అతడు కేవలం మూడో తరగతి వరకే చదువుకున్నాడు.

బయట కేవలం రెండు వేల రూపాయలు విలువచేసే ఓ పాడైపోయిన బైక్ ను కొనుగోలు చేసి దానిని పూర్తిగా విద్యుత్ తో నడిచే విధంగా మార్చేశాడు.

TeluguStop.com - పనికిరాని వాహనాలతో ఈ-బైక్‌ లను తయారుచేస్తున్న మూడో క్లాసు చదువుకున్న వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా తక్కువ ధరకు పాత బైకును కొనుగోలు చేసి వాటిని రీ మోడల్స్ చేస్తూ ఈ- బైకులు గా మార్చి విక్రయిస్తున్న అవసరాలను తీర్చుకుంటున్నాడు సలీం.

ఈ వ్యక్తి ఇప్పటివరకు మొత్తం ఒక కారు, నాలుగు ఈ- బైక్స్ ను తయారు చేసి విక్రయించారు.ఇలా ఆయన తయారు చేసిన వాహనాలు గత కొంత కాలం నుండి విజయవంతంగా రోడ్లపై నడుస్తూనే ఉన్నాయి.44 సంవత్సరాలు ఉన్న సలీం ఇదివరకు అరబ్ దేశంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేశాడు.అక్కడి వాతావరణం సరిపోక 2016లో ఆయన భారత్ కు తిరిగి వచ్చాడు.

అలా తిరిగి వచ్చిన ఆయనకు భారతదేశంలో చిన్న చితకా పనులు చేస్తూ జీవితాన్ని కొనసాగించేవాడు.అయితే చిన్న చిన్న పనులు చేసి విసిగిపోయిన అతడు ఏదైనా సొంతంగా తయారు చేసి సంపాదించాలని భావించాడు.

ఈ క్రమంలోనే అతని ఆలోచన పాత బైకులకు వాటి ఇంజన్ ను తొలగించి బ్యాటరీ అమర్చి కొత్త బైకులను తీర్చిదిద్దుతున్నాడు.

ఇందుకుగాను అతడు మార్కెట్లో లభ్యమయ్యే ఈ- బైక్ లను పరిశీలించి వాటి తరహాలోనే ఛార్జింగ్ పాయింట్లు అమర్చి ఆ పాత వాహనాలను కొత్త బైకులుగా సిద్ధం చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించి సలీం మాట్లాడుతూ.ఒక ఈ బైక్ తయారు చేయడం ద్వారా తాను పెట్టిన పెట్టుబడి కంటే పది ఇంతల ఆదాయం లభిస్తుందని చెప్పుకొచ్చాడు.

తనకు పాత బైక్ కొని దానిని కొత్త బైక్ గా రూపాంతరం చేయడానికి కేవలం మూడు వేల రూపాయలు అవసరం అవుతాయని వివరించాడు.అలా తయారు చేసిన ఈ బైక్ ను అతడు 30 వేలకు విక్రయించినట్లు చెప్పుకొచ్చాడు.

దీంతో తనకు ఉపాధి కల్పన బాగా ఉందని తెలిపాడు.అతని ప్రతిభను స్థానికులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

#E Bike #Saleem #Old Bikes #Uttar Pradesh #ThirdClass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Azamgarh Engineer E Bike Old Vehicles Related Telugu News,Photos/Pics,Images..