అయోధ్య కేసు : తెలంగాణ పోలీసులు అలర్ట్‌  

Ayyodya Case Telangana Police Alert-

సుదీర్ఘ కాలంగా సుప్రీం కోర్టులో కొనసాగుతూ వస్తున్న అయోద్య కేసు తుది తీర్పును మరో వారం రోజుల్లో ఇవ్వబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా శాంతి భద్రతల విషయంలో హై ఎలర్ట్‌ను కేంద్ర హోం శాఖ ప్రకటించింది.ప్రతి రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉండాలంటూ సూచించింది.

Ayyodya Case Telangana Police Alert--Ayyodya Case Telangana Police Alert-

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచడంతో పాటు స్థానిక నాయకులు మరియు మత పెద్దలను గృహ నిర్భందంలో ఉంచాలని నిర్ణయించారు.హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని పెంచారు.సున్నితమైన ప్రాంతాలుగా పేర్కొనే పాతబస్తీ మరియు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరియు జిల్లాల్లోని ముఖ్య ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని టైట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

దేశం మొత్తం కూడా అయోధ్య కేసు తీర్పు విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తుంది.ఎలాంటి తీర్పు వచ్చినా కూడా ప్రజలంతా సామరస్యంతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు కూడా దేశ సమగ్రతకు కృషి చేయాలంటూ ఈ సందర్బంగా పోలీసులు కోరుతున్నారు.