మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోసియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ రైట్స్‌ను దక్కించుకున్నాడు.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా పలువురు స్టార్స్ నేనంటే నేను నటిస్తానంటూ ముందుకు వస్తున్నారట.
బాలకృష్ణ ఇప్పటికే ఈ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్‌లు ఈ సినిమాలో బాలయ్యతో కూడా నటించే అవకాశాలు లేకపోలేదు అంటూ ప్రచారం జరిగింది.

ఆ తర్వాత వెంకటేష్, రవితేజలు కలిసి ఈ రీమేక్‌ను చేయబోతున్నారు అన్నారు.ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్‌పై ఆసక్తిని కనబర్చినట్లుగా వార్తలు వచ్చాయి.ఈ సమయంలో రానా కూడా ఈ రీమేక్‌పై ఆసక్తిగా ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు.సితార ఎంటైర్‌టైన్‌మెంట్స్ వారు ఈ విషయాన్ని అనధికారికంగా వెళ్లడి చేశారు.ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉండగా ఆ ఇద్దరు ఎవరు అనే విషయమై పుకార్లే పుకార్లు పుట్టుకు వస్తున్నాయి.

చివరగా ఈ సినిమా గురించి జనాలు నిజమైన వార్త వచ్చినా నమ్మే పరిస్థితి లేదు.లేటెస్ట్ వార్త ఏంటీ అంటే వెంకటేష్ ఇంకా రానాలు కలిసి ఈ మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందట.ఆ విషయాన్ని సినీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
కాని ఇప్పటి వరకు నిర్మాత వంశీ కాని మేకర్స్ కాని ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.కాని ప్రస్తుతానికి తెలుగు రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతున్నట్లుగా అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది.