అయ్యప్పన్ కోషియమ్ దసరాకి అంతా సిద్ధం... త్రివిక్రమ్ దగ్గరుండి

మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని పవన్ కళ్యాణ్ రానా కలయికలో మల్టీ స్టారర్ చిత్రంగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

 Ayyappan Kosyam Movie Remake Ready To Release In Dasara-TeluguStop.com

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో దర్శకత్వ పర్యవేక్షణ బాద్యతలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

రానా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సన్నివేశాలని షూట్ ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ నటించబోతుందని టాక్ వినిపిస్తుంది.

 Ayyappan Kosyam Movie Remake Ready To Release In Dasara-అయ్యప్పన్ కోషియమ్ దసరాకి అంతా సిద్ధం… త్రివిక్రమ్ దగ్గరుండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని బోగట్టా.పింక్ కి రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తెలుగులో డిజైన్ చేశారు.

అయితే అందులో శృతి హసన్, పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ అంతగా వర్క్ అవుట్ కాలేదని విమర్శలు వచ్చాయి.ఏకే రీమేక్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నేపధ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి త్రివిక్రమ్ రెడీ చేసినట్లు తెలుస్తుంది.

ఈ ఎపిసోడ్ లో నిత్య మీనన్ పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం.రానా ఇమగేజ్ కి డిస్టర్బ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని త్రివిక్రమ్ రెడీ సిద్ధం చేసాడని సమాచారం.

కరోనా సిచువేషన్ నార్మల్ కి రాగానే వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని దసరాకి సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

#AyyappanKoshyam #Dasara #Rana Dabbubati #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు