అమెరికాలో అయ్యప్ప మాల దీక్ష విరమణ...!!!

అమెరికాలో సైతం అయ్యప్ప స్వాముల మాల ధారణ , ఇరుముళ్ళు చేపడుతూ భారతీయులు తమ భక్తీ భావాలని అక్కడ కూడా విస్తృతం చేస్తున్నారు.సహజంగా భారతీయ పండుగలు , పూజలు, సనాతన హింద్రూ సాంప్రదాయాలని కొనసాగిస్తూ వస్తున్న భారతీయులు తాజాగా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, భజనలు చేయడం, అలాగే ఇరుముళ్ళు కట్టుకుని మాల తీయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

 Ayyappa Devotees Deeksha Viramana In Maryland America-TeluguStop.com

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల మేరీల్యాండ్ లో ఉన్న శ్రీ శివా విష్ణు గుడి ఎంతో ఆదరణలో ఉంది.ఇక్కడికి ఎంతో మంది భారతీయులు అమెరికా నలుమూలల నుంచీ వస్తుంటారు.

అంతేకాదు ఇక్కడ 18 మెట్లతో అతిపెద్ద అయ్యప్ప ఆలయం కూడా విస్తరించి ఉంది.ఇందులో పూజల నిమ్మిత్తం తంత్రీ నంబూద్రి స్వామిని కూడా నియమించడం జరిగింది.

Telugu Ayyappadevotees, Nri Ups-

ఈ అయ్యప్ప స్వామీ గుడి నిర్వహణ బాధ్యతలు సురేష్ బాబు, నివాస్ లు చూసుకుంటుండగా వందల మంది భక్తులు రోజూ వస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సుమారు 200 మంది అయ్యప్ప స్వాములు మాలలు ధరించడం జరిగింది.మాల ధారణ చేసిన భక్తులు శనివారం రోజున ఇరుముళ్ళు కట్టుకుని మాలలు తీయడం జరిగింది.18 మెట్లు ఎక్కి స్వామికి నెయ్యితో అభిషేకం చేసి మాలలు స్వామీ సన్నిధిలో అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా వేడుకల జరిగిందని స్థానిక భారతీయులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube