అయ్యబాబోయ్ ఒకేరోజు ఏపీలో ఇన్ని కరోనా కేసులా.. ??  

ayyababoy how many corona cases in one day in ap, Andhra Pradesh, Corona Virus, Positive Cases, COVID19 - Telugu Andhra Pradesh, Corona Virus, Covid19, Positive Cases

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఊపిరి తీసుకున్న కరోనా ప్రస్తుతం తగ్గిపోతుందని దాదాపుగా ప్రజలందరు హాయిగా తమపనులు తాము చేసుకుంటున్నారు.కానీ కరోనా ఎక్కడికి వెళ్లలేదని, అది మనమధ్యే దొంగలా తిరుగుతుందని గ్రహించలేక పోతున్నారు.

TeluguStop.com - Ayyababoy How Many Corona Cases In One Day In Ap

కోవిడ్ లాంటి వైరస్ లోకంలోకి అడుగు పెట్టడమే కానీ తిరిగిపోవడం అంటూ జరగదు.మరి వ్యాక్సిన్ వచ్చింది కదా అని ఆలోచిస్తున్నారా.ప్రస్తుతం వచ్చిన వ్యాక్సిన్ సామర్ధ్యం ఇంకా పూర్తి స్దాయిలో నిరూపించబడలేదు కదా.కాబట్టి యధావిధిగా కరోనా బారినుండి తప్పించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిందే.ఇకపోతే ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుందట.గత 24 గంటల వ్యవధిలో 43,770 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 158 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందట.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 35 కేసులు.పశ్చిమ గోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు.

TeluguStop.com - అయ్యబాబోయ్ ఒకేరోజు ఏపీలో ఇన్ని కరోనా కేసులా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు వచ్చాయి.

అదే సమయంలో 172 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారట.

ఆ మరణం విశాఖ జిల్లాలో నమోదైందని అధికారులు పేర్కొన్నారట.

#COVID19 #Positive Cases #Andhra Pradesh #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు