అయ్య బాబోయ్: భార్యకున్నఆ ఫోబియా దెబ్బకి 18 ఇళ్లు మారిన జంట.. చివరకి..?!

సాధారణంగా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారాలంటే చాలా వ్యయప్రయాసలు ఉంటాయి.అందుకే ఎవరూ కూడా చిన్న విషయాలకి ఇల్లు మారేందుకు అస్సలు ఆసక్తి చూపించరు.

 Ayya The Couple Who Moved 18 Houses Due To The Phobia Of Their Wife Finally-TeluguStop.com

కానీ మధ్యప్రదేశ్ లో ఒక జంట ఓ చిన్న కారణం తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సార్లు ఇళ్ళు మారారు.ఇంతకీ ఆ చిన్న కారణం ఏంటో తెలుసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో నివసిస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి 2017 లో ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు.అయితే ఆమెకు బొద్దింకల అంటే చాలా భయం.ఈ విషయం తెలిసిన భర్త సాధారణంగా ఆడవారు బొద్దింకలను చూసి భయపడతార ఇది మామూలే కదా అని అంత సీరియస్ గా తీసుకోలేదు.కానీ ఒక రోజు వంట గదిలో బొద్దింక కనిపించేసరికి భార్య గట్టిగా అరుస్తూ వంట గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తూ నానా బీభత్సం సృష్టించింది.దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన భర్త వెంటనే ఏమైందోనని వచ్చి చూడగా.

బొద్దింక ని చూసి తన భార్య భయపడిపోయిందని తెలుసుకున్నాడు.

అయితే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని సదరు భార్య తన భర్తకు చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఆయన 2018 సంవత్సరంలో మొదటి సారిగా ఇల్లు మారాడు.

కానీ కొత్త ఇంట్లో కూడా బొద్దింక కనిపించడంతో ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఇల్లు పీకి పందిరి వేసింది.దీంతో మళ్లీ సదరు భర్త వేరొక ఇంటి లోకి మారాడు.

ఈ విధంగా భార్య బొద్దింకలను చూసి కేకలు వేయడం భర్త ఇల్లు మారడం సాధారణమైపోయింది.చివరికి ఆ భర్త తన భార్యకున్న బొద్దింకల ఫోబియా వలన 18 సార్లు ఇల్లు మారాడు.

ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రముఖ మానసిక నిపుణుల చేత కూడా వైద్యం చేయించాడు.దీంతో వైద్యులు ఆమెకు మందులు రాసి ఇచ్చారు కానీ ఆమె అవి వాడటం లేదు.

మళ్లీ ఎప్పటిలాగానే భార్య బొద్దింకలను చూసి అరుస్తూనే ఉంది అలాగే ఇల్లు మారాలని తన భర్తని ఒత్తిడి చేస్తూనే ఉంది.దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అయితే భార్య మాత్రం తన భర్త తనని ఓ మానసిక రోగుల చూస్తున్నాడని తన బాధను తన భర్త అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube