అబ్బాయితో హీరో రొమాన్స్.. నో ఎంట్రీ అంటోన్న గల్ఫ్ దేశాలు  

Ayushman Khurana Shubh Mangal Zyada Savdhan Movie Banned In Gulf - Telugu Ayushman Khurana, Bollywood Movie News, Gulf, Homeual Movie, Shubh Mangal Zyada Savdhan

బాలీవుడ్‌లో స్టార్ హీరోలకు పోటీగా కేవలం తన మూవీ సెలెక్షన్లతో జనాలను ఆకట్టుకుంటున్న హీరో ఆయుష్మాన్ ఖురానా.ఈ హీరో ఎంచుకునే కథలు విభిన్నంగా ఉండటంతో అతడు చేసే ప్రతి సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపుతున్నారు.

Ayushman Khurana Shubh Mangal Zyada Savdhan Movie Banned In Gulf

ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘శుభ్ మంగల్ జ్యాదా సావ్‌ధాన్’ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను దక్కించుకుంది.

అయితే ఈ సినిమా స్వలింగ సంపర్కం నేపథ్యంలో ఉండటంతో ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొంటోంది.

ఈ సినిమాలో హీరో మరో అబ్బాయితో రొమాన్స్ చేస్తాడు.ఈ అంశాన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

తమ సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకం కావడంతో ఇలాంటి సినిమాలను తాము అనుమతించమని అక్కడి సెన్సార్ బోర్డు తెలిపింది.కాగా అలాంటి సీన్‌లను తాము తొలగించామని చిత్ర యూనిట్ తెలిపినా ఈ సినిమాను గల్ఫ్ దేశాలు నిషేధించాయి.

ఆయుష్మాన్ ఖురానా – జితేంద్రల మధ్య నడిచే రొమాన్స్‌ను చాలా ఘాటుగా చూపించారట చిత్ర యూనిట్.ఈ సీన్స్‌ను తొలగించాలంటూ భారత్‌లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.మరి ఇన్ని వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

Ayushman Khurana Shubh Mangal Zyada Savdhan Movie Banned In Gulf-bollywood Movie News,gulf,homeual Movie,shubh Mangal Zyada Savdhan Related....