కరోనా కట్టడి కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పిన ఆరోగ్య సూత్రాలివే..?

ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నాయి.అన్ని వయస్సుల వారికి సోకుతున్న ఈ వైరస్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతోంది.

 Corona Virus, Immunity Powder, Tulsi, Sanjeevani, Ayurvedic Medicines, Ayurvedic-TeluguStop.com

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సహజసిద్ధంగా లభించే ఆహార పదార్థాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.తీసుకునే ఆహారంలో శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం ఇప్పటికే ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రకటించి ఎవరికి వారు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు కొన్ని సూచనలు చేసింది.ఆయుష్ ప్రోటోకాల్ ప్రతిరోజూ అరగంట పాటు యోగా చేయడం, గోరు వెచ్చని లేదా నిమ్మకాయ నీటిని తీసుకోవడం, బెల్లం తిన్నడం, తక్కువ మోతాదులో చ్యవన్ వ్రాస్ తీసుకోవడం మంచిదని చెబుతోంది.

ఇవి తీసుకుంటే తక్కువ సమయంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుష్ ప్రోటోకాల్ సూచిస్తోంది.

Telugu Ayurvedic, Corona, Hot, Immunity Powder, Sanjeevani, Tulsi, Turmeric Powd

తులసి, సంజీవని వటి లాంటి ఆయుర్వేద ఔషధాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.రోజుకు రెండు సార్లు వేడి నీటిలో పసుపు వేసుకుని తాగినా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు.వంటల్లో తరచుగా కొత్తిమీర, జీలకర్ర, పసుపు ఉపయోగించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube