IPL 22: ఆయుష్ బదోనీ కొట్టిన బంతి తలకి గట్టిగా తగలడంతో రోదిస్తున్న మహిళ!

అపుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి.అయితే అవి అన్ని అనుకోకుండానే జరుగుతాయి.

 Ayush Badoni Six Hits Woman In Stands-TeluguStop.com

కొన్ని సంఘటనలు ఆటగాళ్ల మధ్య జరిగితే, మరికొన్ని సంఘటనలు అంఫైర్స్ కి ఆటగాళ్లకు మధ్య జరుగుతాయి.అయితే అరుదుగా కొన్ని సంఘటనలు మాత్రం ఆటగాళ్లకు, చూసే ఆడియన్స్ కి మధ్య జరుగుతాయి.

ఇక ఇవి ఎలాంటివనేగా మీ సందేహం.అసలు విషయంలోకి వెళితే, టీ20 క్రికెట్ అటాకింగ్ మోడ్ లో జరిగే ఆటతీరు చూపరులకు మంచి వినోదాన్ని కలిగిస్తుంది.

అయితే ఆ మధ్యలోనే కాస్త అపశృతి జరిగింది.

ఇటీవల మొదలైన ఐపీఎల్ 2022లో సిక్సుల మోత మోగిపోతుంది.

LSG (లక్నో సూపర్ జెయింట్స్), CSK (చెన్నై సూపర్ కింగ్స్) మ్యాచ్ లో ఓ అద్భుతమైన షాట్ కొట్టాడు లక్నో సూపర్ జెయింట్స్ కు చెందిన యువ క్రికెటర్.అయితే తాను బాదిన బంతి నేరుగా వెళ్లి మహిళ తలకు తగిలింది.

పసుపు రంగు టీ షర్ట్ లో కూర్చొన్న మహిళ.ఆ సిక్సుకు కాసేపటి వరకూ ఏమీ మాట్లాడలేకపోయింది.

బహుశా ఆమె బుర్ర అంతా బ్లాంక్ అయిపోయి ఉండొచ్చు.ఇంతకీ ఆ అగ్రెసివ్ ప్లేయర్ ఎవరంటే ఆయుష్.

అసలు విషయానికొస్తే, నిజానికి ఆ బాల్ ను సదరు మహిళ క్యాచ్ పట్టుకుందామని ప్రయత్నించి ఫెయిల్ అయిందట.

Telugu Audiance, Ayush Badoni, Ayush, Hits, Chennai, Injure, Ipl, Luknow, Ravind

రీప్లేలో బాల్ పట్టుకుందామని చేతులతో ప్రయత్నించగా.అది మిస్ అయి నేరుగా తల మీద పడ్డట్లు క్లియర్ గా కనిపించింది.ఈ క్రమంలో స్టేడియం స్టాఫ్ ఒకరు ఆమె వద్దకు వెళ్లి సమస్యగా అనిపిస్తుందా అని వాకబు చేసి సేఫ్ అని తెలిసి కుదుటపడ్డారు.

ఇకపోతే తాజాగా క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తామని చెన్నై కెప్టెన్‌ రవీంద్ర జడేజా అనడం కాస్త వైరల్ అయింది.గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 210/7 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా చివరి ఓవర్‌లో ఓటమిపాలైన విషయం తెలిసినదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube