మధుమేహం అదుపులో ఉండాలంటే... ఎఫెక్టివ్ చిట్కాలు     2018-05-23   00:06:47  IST  Lakshmi P

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న,పెద్ద,ఆడ ,మగ అనే తేడా లేకుండా అందరు మధుమేహం బారిన పడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు,సరైన నిద్ర లేకపోవటం,సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం మరియు పోషకాహార లోపం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జీవనశైలిలో మార్పులు చేసుకొని ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని త్రాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అంతేకాక ప్రతి రోజు పాలు త్రాగటం వలన ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో ఎముకలు బలహీనంగా మారతాయి.