'వెంకీమామ'పై అయోధ్య తీర్పు ఎఫెక్ట్‌

గత ఏడాది ప్రారంభం అయిన వెంకీ మామ సినిమా విడుదల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.ఎన్నో నెలలుగా వెంకీ మామ సినిమా విడుదల అదుగో ఇదుగో అంటూ ప్రచారం చేస్తున్నారు.

 Ayodhyaeffect On Venky Mama Movie-TeluguStop.com

కాని సినిమా విడుదల ఈ ఏడాది ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొన్నటి వరకు డిసెంబర్‌ 6న సినిమాను విడుదల చేయడం బెటర్‌ అంటూ అంతా అనుకున్నారు.

నిర్మాత సురేష్‌బాబు కూడా అదే భావించాడు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ తేదీలో విడుదల కావడం లేదు.

ప్రస్తుతం సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ 6ను బ్లాక్‌ డే గా జరుపుకుంటారు.సాదారణంగానే ఆ రోజున కాస్త వాతావరణం సీరియస్‌గా ఉంటుంది.

అలాంటిది అయోధ్య తీర్పు తర్వాత రాబోతున్న మొదటి బ్లాక్‌ డే అవ్వడం వల్ల ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందుకే ఆరోజున వెంకీ మామ సినిమాను విడుదల చేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Ayodhyaeffect, Ayodhya, Venkatesh, Naga Chaitanya, Venky Mama-

బ్లాక్‌ డే రోజు సినిమాను విడుదల చేసి రిస్క్‌ తీసుకోవడం కన్నా డిసెంబర్‌ చివరి వారంలో సినిమాను విడుదల చేయడం ఉత్తమం అనుకుంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారట.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.సినిమా విడుదల విషయమై కాస్త గందరగోళం నెలకొంది.త్వరలోనే సురేష్‌ బాబు నుండి ఒక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube