సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు..!  

utter pradesh cm yogi adhithyanath, ayodhya, visit canceled, ram mandir - Telugu Ayodhya, Ram Mandir, Utter Pradesh Cm Yogi Adhithyanath, Visit Canceled

నేటి అయోధ్య పర్యటనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ రద్దు చేసుకున్నారు.రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించాల్సి ఉంది.

 Ayodhya Visit Canceled Ram Mandir

అయితే రాష్ట్ర మంత్రి కమలా రాణి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.ఆమె మృతి చెందడంతో యోగి పర్యటనను రద్దు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 5వ తేదీన రామ మందిర భూమి పూజ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రామ జన్మ భూమిని సీఎం యోగి సందర్శించాల్సి ఉంది.

సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మరోవైపు హనుమన్ గారి ఆలయం, రామ్ కి పాడి కూడా సందర్శించాల్సి ఉంది.సీఎం యోగి పర్యటన రద్దు కావడంతో హనుమాన్ గారి ఆలయం వద్ద నిషన్ పూజను రద్దు చేసినట్లు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.

ఆదివారం జరగాల్సిన నిషన్ పూజను మంగళవారం నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.రాముడికి సంబంధించి ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు హనుమంతుని నిషన్ పూజ తప్పకుండా జరపాలనే ఆచారం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

#Ram Mandir #Visit Canceled #Ayodhya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ayodhya Visit Canceled Ram Mandir Related Telugu News,Photos/Pics,Images..