అయోధ్య రామాలయ డిజైన్ ఎంత బాగుందో!

హిందువులందరూ కొన్ని దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి భూమి పూజ రేపు జరగనున్న విషయం తెలిసిందే.శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొంత మంది అతిథులు, భక్తుల మధ్య శ్రీరామలయ భూమి పూజ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగనుంది.

 Ayodhya Ramalayam, Extraordinary Design, Ram Mandir Ceremony, Ayodhya Ramalaya D-TeluguStop.com

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

అయితే అయోద్యలో నిర్మించిననున్న రామాలయ డిజైన్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి హిందువులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించబోయే రామాలయంకు సంబంధించిన డిజైన్ ప్రభుత్వం నేడు మంగళవారం విడుదల చేసింది.

ఇక ఈ డిజైన్ హిందువుల అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది.మూడు అంతస్తుల కట్టడంపై పిల్లర్లు మండపం ద్వారా ఆలయ నమూనా ఎంతగానో ఆకట్టుకుంటుంది.161 అడుగుల ఎత్తున్న ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది.ఆలయ శిల్ప కళ కుటుంబం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ ద్వారానే రామాలయానికి సంబంధించిన విషయాలు రూపొందించినట్లు సమాచారం.

ఎంతో మంది భక్తుల ప్రవేశానికి అనుకూలంగా… 2 ద్వారాలకు బదులు 5 ద్వారాలను ఏర్పాటు చేసి నిర్మిస్తున్నట్లు అలాగే ఆలయ నిర్మాణం డిజైన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఏదేమైనా అయోధ్యలో నిర్మాణమయ్యే రామాలయ డిజైన్ చూసి ప్రస్తుతం అందరూ ఫిదా అయిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube