మొదలైన అయోధ్య రామ‌మందిరం నిర్మాణ పనులు... రాగిని విరాళం ఇవ్వాలంటున్న ట్ర‌స్టు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ...!

ఇటీవల అయోధ్య రామ మందిర నిర్మాణం లో భాగంగా భూమిపూజ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక ఆలయ నిర్మాణ పనులలో భాగంగా నేడు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామాలయ నిర్మాణం నిర్వహణ సంబంధించి పలు అంశాలు చర్చించారు.

 Ram Mandir Trust Asks Hindus To Donate Copper, Indians, Ram Mandir, Ayodhya, Ear-TeluguStop.com

ఈ కార్యక్రంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ సంపత్ రాయి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోని హిందువులు ఆలయ నిర్మాణం కోసం రాగిని విరాళం ఇవ్వాలని ఆయన కోరారు.

ఆలయం నిర్మాణం కోసం 1990లో శిలలు దానం చేసినట్లు విధంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందువులందరూ కూడా రాగిని దానం చేయాలని ఆయన కోరారు.కనీసం ఆలయం వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఆలయాన్ని నిర్మించబోతున్నామని జనరల్ సెక్రటరీ సంపత్ రాయి తెలియజేశారు.

ఇకపోతే రామమందిర ఆలయ నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టి కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇక భూ పరీక్ష కోసం ఐఐటి చెన్నై ఇంజనీర్లను ఇప్పటికే అయోధ్యకు పిలిపించినట్లు సమావేశంలో తెలిపారు.

అటుపై ఎప్పుడైనా అనుకోని పరిస్థితిలో భూకంపాలు సంభవించినా కూడా ఆలయాన్ని దర్శించుకునే విధంగా నిర్మాణం చేపడుతున్నారు.అందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని సంపత్ రాయి తెలియజేశారు.

ఇక ఆలయ నిర్మాణం కోసం పదివేల రాగి రాడ్లు అవసరమవుతాయని తెలియజేశారు.ఇక ఆలయ నిర్మాణం కోసం పూర్తిగా రాగి నే ఉపయోగిస్తున్నట్లు, మరి ఏ ఉక్కు పదార్థం ఉపయోగించడం లేదని తెలిపారు.

ఇక ఆలయ నిర్మాణం కోసం కనీసం మూడు సంవత్సరాలకు పైనే సమయం పడుతుందని సంపత్ రాయ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube