టాలీవుడ్ లో డాన్సింగ్ క్వీన్ గా ఇప్పుడు చరిష్మా చూపిస్తున్న క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి.తను చేసిన తెలుగు, తమిళ సినిమాలకి సంబందించిన సాంగ్స్ తో యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి చేసిన సినిమాలు తక్కువే అయిన హీరోలలో బన్నీ, హీరోయిన్స్ సాయి పల్లవి తర్వాతే డాన్స్ లో ఎవరైనా అనే గుర్తింపు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ భామ మరో సారి తన మొదటి సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములతో లవ్ స్టొరీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చైతూతో సాయి పల్లవి రొమాన్స్ చేస్తుంది.
ఇక ఈ సినిమా నుంచి ఏయ్ పిల్లా ఫస్ట్ సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ చేసారు.అందులో సాయి పల్లవి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది.
ఇదిలా ఉంటే హోలీ సందర్భంగా ఈ సాంగ్ ఫుల్ లెరికల్ వీడియోని చిత్ర యూనిట్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతుంది.సాయంత్రం నలుగు గంటలకి ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు.
దీనికి సంబందించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.సాయి పల్లవి సాంగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే ప్రేక్షకులకి, చైతూ ఫాన్స్ కి ఇది ఎంత వరకు నచ్చుతుంది అనేది వేచి చూడాలి.