సికింద్రాబాద్ హరిహర కళాభవనంలో దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సు.

ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ.ఎమ్మెల్యేలు రాజసింగ్, ముఠా గోపాల్,హైదరాబాద్ కలెక్టర్ అంటరాని తనాన్ని రూపు మాపాలి.

 Awareness Seminar For Dalit Beneficiaries At Secunderabad Harihara Kalabhavan ,-TeluguStop.com

దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.

దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

దళిత బంధు క్రింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు.

లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

రాష్ట్రంలోని చివరి దళితుని వరకు ఈ పథకం అందేవిదంగా చేయడమే కేసీఆర్ ఆశయమని వెల్లడించారు.ఈ పథకం పట్ల దేశ ప్రజలంతా కావాలని కోరుకునే పరిస్తితి రావడం ఖాయమని అన్నారు.

మహమూద్ అలీ మాట్లాడుతూ మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తిస్తుందని వివరించారు.

ఇది సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube