బ్రేక్ ఈవెన్‌కు చేరువలో బన్నీ.. డౌటే అంటున్న మహేష్  

Avpl Ready To Break Even In Us-allu Arjun,avpl,collections,mahesh Babu,sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ మహేష్ సత్తాను చాటుతోంది.

Avpl Ready To Break Even In Us-allu Arjun,avpl,collections,mahesh Babu,sarileru Neekevvaru -AVPL Ready To Break Even In US-Allu Arjun Avpl Collections Mahesh Babu Sarileru Neekevvaru

ఇప్పటికే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.అయితే ఈ సినిమాకు పోటీగా వచ్చిన మరో సినిమా ‘అల వైకుంఠపురములో’ మహేష్ సినిమాకు గట్గి పోటీ ఇస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ మహేష్ సినిమాకు గట్టి పోటీనిస్తుంది.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో అల వైకుంఠపురములో సినిమా దూసుకుపోతుంది.బుధవారం నాటికి అల వైకుంఠపురములో సినిమా $1,882,973 వసూలు చేసింద.

కాగా సరిలేరు నీకెవ్వరు $1,825,558 కలెక్ట్ చేసింది.

అల వైకుంఠపురములో సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే 2మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాలి.శుక్రవారం ముగిసే సరికి ఈ సినిమా అలవోకగా బ్రేక్‌ఈవెన్‌కు చేరుకుంటుందని, ఓవరాల్‌గా ఈ సినిమా టోటల్ రన్‌లో 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే 3 మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంది.

అయితే ఈ సినిమా ఆ ఫీట్ సాధించడం కష్టమే అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.ఓవరాల్‌గా ఈ సినిమా టోటల్ రన్‌లో 2.1 మిలియన్ డాలర్ల వరకు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

తాజా వార్తలు

Avpl Ready To Break Even In Us-allu Arjun,avpl,collections,mahesh Babu,sarileru Neekevvaru Related....