కీళ్లనొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలను తింటే డేంజర్....అవి ఏమిటో తెలుసుకోండి     2017-11-17   20:38:31  IST  Lakshmi P

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్లనొప్పులతో బాధ పడుతూ ఉన్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు నడవటానికి కూడా చాలా కష్టం అయ్యిపోతుంది. ఈ నొప్పులు పెరగటానికి వారు తీసుకొనే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. ఆ ఆహారాలను తెలుసుకొని వాటికీ దూరంగా ఉంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

రెడ్ మీట్ ,ప్రాసెస్ చేసిన మీట్
ఈ ఆహారంలో నైట్రేట్స్, పూరిన్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులను, వాపులను పెంచుతుంది. అంతేకాక టాక్సిన్స్ ఉండుట వలన ఇన్ఫ్లేమేషన్ ని పెంచుతాయి.

ఆర్టిఫిషియల్ షుగర్స్
ఆర్టిఫిషియల్ షుగర్స్ తీసుకోవటం వలన శరీరంలో అడ్వాన్స్డ్ గ్లెకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి. తద్వారా వాపులు పెరుగుతాయి. అంతేకాక షుగర్ కారణంగా శరీరంలో సైటోకినిన్స్ విడుదల అయ్యి ఇన్ఫ్లేమేషన్ ని పెంచుతుంది. అలాగే షుగర్ కారణంగా బరువు పెరిగి కీళ్ల మీద భారం పడుతుంది.

కార్న్ ఆయిల్
కీళ్ల నొప్పులు ఉన్నవారికి హానికరమైన ఆహారం కార్న్ ఆయిల్. కార్న్ ఆయిల్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండుట వలన శరీరంలో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తుంది.


మైదా
మైదా కీళ్ల నొప్పులు ఉన్నవారు అసలు తినకూడని ఆహారం. మైదాతో తయారుచేసిన ఎటువంటి పదార్ధాలను తినకూడదు. వీటిలో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అధికంగా ఉండుట వలన కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.

గుడ్లు
గుడ్లు రోజు తింటూ ఉంటే కీళ్లనొప్పులు మరియు వాపులు పెరుగుతాయి. గుడ్డులో ఉండే పచ్చసొన ఆర్చిడోనిక్ యాసిడ్, ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ గుడ్డు తినాలని అనుకున్నప్పుడు గుడ్డులోని పచ్చసొన తినకుండా తెల్లసొన తినాలి.

ప్రోటీన్
ఏ ప్రోటీన్ ఆహారంలోనైనా గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. కీళ్లనొప్పులను పెంచుతుంది. అందువల్ల ప్రోటీన్ ఫుడ్ కి దూరంగా ఉంటేనే మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ విడుదలయ్యే జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. దాంతో క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ దారితీస్తుంది.

చూసారుగా ఫ్రెండ్స్ కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.