శ్రావణమాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఎట్టి పరిస్థితిలోను ఈ తప్పులు చేయకూడదు... ఒక వేళ చేస్తే  

మరో పది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు అవుతాయి. ఈ శ్రావణమాసంలో ఉత్తర భారతదేశం వారు శివుణ్ణి పూజించటానికి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. శ్రావణమాసంలో జరిగిన సముద్రమధనంలో శివుడు కీలకమైన పాత్రను పోషించారు. అందువల్ల ఈ మాసమును శివునికి అంకితం చేయబడింది. ఈ పవిత్ర మాసంలో శివుణ్ణి ఆరాదిస్తే కోరుకున్న కోరికలు,అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు మరియు దానాల వంటి వాటిని భక్తి శ్రద్దలతో చేస్తారు. శివుణ్ణి అంకితభావంతో పూజించేటప్పుడు కొన్ని తప్పులను చేయకూడదు. ఆ తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

పసుపును శివునికి సమర్పించకూడదు

సాధారణంగా మన పూజ సామగ్రిలో పసుపు,కుంకుమ తప్పనిసరిగా ఉంటాయి. స్త్రీ దేవతలకు తప్పనిసరిగా పసుపు,కుంకుమతో పూజ చేస్తాం. అయితే శివుడు యోగి కాబట్టి పసుపు సమర్పించకూడదు.

పచ్చిపాలను సమర్పించకూడదు

సాధారణంగా పచ్చిపాలతో శివునికి అభిషేకం చేస్తూ ఉంటాం. కానీ శ్రావణమాసంలో మాత్రం పచ్చిపాలను ఉపయోగించకూడదు. పాలను కాచిన తర్వాతే శివునికి సమర్పణ చేయాలి.

Avoid Doing These Common Mistakes During Shravana Month-

Avoid Doing These Common Mistakes During Shravana Month

శ్రావణమాసంలో బ్రహ్మ ముహర్తంలో మేల్కోవాలి

చాలా మంది శ్రావణమాసంలో కాస్త లేటుగా లేగిస్తూ ఉంటారు. అయితే బ్రహ్మ ముహర్తంలో లేచి స్నానం చేస్తే మంచిది. ఆ సమయంలో స్నానము ఆచరించటం వలన శరీరంలో సానుకూల శక్తి క్రియాశీలంగా మారి ఏకాగ్రత భగవంతుని మీద ఉంటుంది.

వంకాయ తినకూడదు

ప్రాచీన హిందూ ధర్మాల ప్రకారం శ్రావణమాసం మొత్తం వంకాయను తినకూడదు. ఈ మాసంలో వంకాయ తినటం అశుభంగా భావిస్తారు.

చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి

ఈ మాసంలో చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. అవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మంచి ఆలోచనలను చేయాలి. అమాయక ప్రాణులను హింసించకూడదు. మత్తు పదార్ధాలకు,మాంసాహారానికి దూరంగా లేకపోతే ప్రతికూల ప్రభావాన్ని చూపి రాక్షస ప్రవృత్తిని కలిగిస్తాయి.