ఆ విషయంలో గెటప్ శీను ను ఫాలో అయిన ముక్కు అవినాష్...

మరో రెండు రోజుల్లో తెలుగు వారి పెద్ద పండగ అయిన సంక్రాంతి మొదలవనుంది.దీనితో బుల్లితెరలో అప్పుడే హడావుడి మొదలయిపోయింది.

 Avinash The Nose Who Followed Getup Sheen In That Regard-TeluguStop.com

ఈసారి ఈ పండగ సందర్బంగా అన్ని తెలుగు ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెల్స్ లో స్పెష‌ల్ ప్రోగ్రామ్‌ లు ప్ర‌సారం కాబోతున్నాయి.ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈటీవీలో “అత్తో అత్త‌మ్మ కూతురో” అనే ప్రోగ్రామ్ అలాగే స్టార్ మాలో “ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ“, జీ తెలుగులో “సంక్రాంతి సంబ‌రాలు 2021” అనే పేర్లతో స్పెషల్ ప్రోగ్రామ్‌ లు మనల్ని అలరించడానికి ముస్తాబయ్యి వస్తున్నాయి.ఇప్పుడు ఈ విషయాన్నీ ప‌క్క‌న‌పెడితే అసలు సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ‌ అని చెప్పుకుంటారు కాబ‌ట్టి.

 Avinash The Nose Who Followed Getup Sheen In That Regard-ఆ విషయంలో గెటప్ శీను ను ఫాలో అయిన ముక్కు అవినాష్…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైతుల యొక్క గొప్ప‌ద‌నం గురించి చూపిస్తూ ఈ ప్రోగ్రామ్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా ఈటీవీ లో ప్రసారం కానున్న అత్తో అత్త‌మ్మ కూతురు ప్రోగ్రామ్‌ లో రైతుల గొప్ప‌ద‌నం, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి గెట‌ప్ శ్రీను ఓ ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌నున్నారు.

అందులో చివ‌ర్లో త‌న గొంతు కోసుకున్నాడు గెటప్ శ్రీను.అది చుసిన అందరి కళ్ళలో నీళ్లు మెదులుతాయి.శ్రీను చేసిన పెర్ఫార్మన్స్ కి అక్కడ దానికి ఉన్న అంద‌రూ కంట‌త‌డి పెట్టుకున్నట్లుగా ప్రోమోలో చూపించారు.అయితే స్టార్ మాలో ప్ర‌సారం కానున్న “ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ “ప్రోగ్రామ్‌ లో కూడా ఇదే తరహాలో ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌నున్నారు.

జబర్దస్త్ ముక్కు అవినాష్ ఈ ప‌ర్ఫామెన్స్ ఇస్తున్నారు.ఇందులో కూడా అవినాష్ రైతుల సమ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ.ఆఖరిలో పురుగుల మందు తాగుతాడు.ఆ ఫ‌ర్ఫామెన్స్ త‌రువాత అక్క‌డి వారుకూడా ఎంతో భావోద్వేగానికి గురి అయిన‌ట్లు ప్రోమోలో చూపించారు.ఇలా ఈ రెండు ఫ‌ర్ఫామెన్స్‌ లు రైతుల సమస్యల గురించి చెప్పే విధానంలో ఒకదాన్ని ఒకటి పోలినట్లు ఉన్నాయి.గెటప్ శ్రీను గొంతు కోసుకుంటే, అవినాష్ పురుగుల మందు తాగుతాడు.

ఏది ఏమయినా గాని ఈ రెండు పెరఫార్మెన్స్ లు అందరిని కంటతడి పెట్టించాయి.మ‌రోవైపు ఈ ప్రోగ్రామ్‌ ల‌లో రానున్న డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌ లు, అలాగే కామెడీ స్కిట్‌ లు కూడా ప్రేక్షకులను బాగా అలరించడానికి సిద్ధమైపోయారు.

#Sepcial Program #Getap Sreenu #Special #Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు