తన మనసులోని మాటను బయటపెట్టిన అవినాష్..!?

100 రోజుల పాటు బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 4.ఈ సీజన్ మొత్తంలో బిగ్ బాస్ హౌస్ లో చాలా క్లోజ్ గా ఉన్న జంటలలో అరియనా, అవినాష్ ఒకరు.

 Avinash Reveals The Word In His Mind, Ariyana, Avinash, Its A Family Party, Star-TeluguStop.com

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కొత్తలో వీరిద్దరి మధ్య కాస్త తక్కువ పరిచయం ఉన్న ఆ తర్వాత వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు.ఈ తరుణంలోనే ఒక రోజు అరియనా తన పక్కన ఉన్న సమయంలో సోఫాలో ఏదో రాసాడని.

అప్పట్లో ఒక పెద్ద చర్చ కొనసాగింది.దీనితోపాటు నాగార్జున వచ్చిన సమయంలో కూడా అసలు సోఫా మీద ఏం రాశావ్ అంటూ అవినాష్ అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరోవైపు అవినాష్ ఎలిమినేట్ అవుతున్నట్లు ఒకసారి నాగార్జున తెలిపిన సమయంలో అరియనా చాలా ఫీల్ అయిపోయింది.నువ్వు బయటికి వెళితే ఏమి చేసుకోకు నాకు మాట ఇవ్వు అంటూ అవినాష్ నుంచి ఒట్టు వేయించుకుంది.

ఇది ఇలా ఉండగా అవినాష్ అనేకసార్లు నాకు నీ డ్రెస్ బాగుంది.నీవు బాగుంటావు అంటూ అరియనకు బిస్కెట్లు వేసేవాడు.

అవినాష్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా అరియానకు బాగా మంచి సపోర్ట్ అందజేశాడు.హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం అరియనా కూడా అవినాష్ తన ఒక బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేసింది.ఈ తరుణంలో వీరిద్దరికీ మంచి వరుస ఆఫర్లు వస్తున్నట్లు వార్తలలో మనం గమనిస్తూనే ఉన్నాం.ఇది ఇలా ఉండగా మరోవైపు తాజాగా వీరిద్దరూ కలిసి స్టార్ మా లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారం అవుతున్న “ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ” అనే ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు.

తాజాగా ఎందుకు సంబంధించిన ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది స్టార్ మా.ఈ ప్రోమో అనుగుణంగా అరియానను చూడగానే అవినాష్ కింద పడిపోతాడు.అనంతరం నన్ను చూసి ఏమి ఆలోచిస్తున్నావ్.? ఏంటి.? అని అరియనా అవినాష్ ను అడగగా హౌస్ లో ఉన్నప్పుడే చెబుదాం అనుకున్నాను.కానీ, ఇదే కరెక్ట్ సమయం అంటూ అవినాష్ ఎదో చెప్పే ప్రయత్నం చేసినట్లు ప్రోమో లో అర్థమవుతుంది.

అలాగే అరియనాను ఎత్తుకొని డాన్స్ కూడా చేసినట్లు అర్థమవుతుంది.ఇంతకీ అవినాష్, అరియానా తో ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలి అంటే ప్రోగ్రాం ప్రసారం అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube