కాబోయే భార్యతో అవినాష్ రొమాన్స్.. మధ్యలో డిస్ట్రబ్ చేసిన శ్రీముఖి?

జబర్దస్త్‌ షో ద్వారా పరిచయమై తన కామెడీతో ప్రేక్షకుల ఆదరణాభిమానాలను పొందుతున్నారు అవినాష్.ఆ తర్వాత పలు షోలలోనూ తన టాలెంట్‌తో బుల్లితెర కమెడియన్‌గా ఆయన అవతరించారు.

 Avinash Photo Shoot With Her Lover Anuja And Sreemukhi Funny Comments-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4లోనూ జోకర్‌గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్.ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సెట్ చేసుకున్నాడు.

అంతకముందు జబర్దస్త్ షో ద్వారా కొన్నాళ్ల పాటు హ్యాపీగానే కొనసాగినా.ఆ తరువాత సడన్‌గా లాక్ డౌన్ రావడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే.

 Avinash Photo Shoot With Her Lover Anuja And Sreemukhi Funny Comments-కాబోయే భార్యతో అవినాష్ రొమాన్స్.. మధ్యలో డిస్ట్రబ్ చేసిన శ్రీముఖి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా.బిగ్ బాస్ అనంతరం అవినాష్ లైఫ్‌లో కూడా భిన్న మార్పులు చోటుచేసుకున్నాయి.ఒక్కసారిగా తన జీవితం కూడా మారిపోయింది.భారీగా ఆదాయం అందుకోవడమే కాకుండా సొంతంగా ఓ ప్రత్యేకమైన ఇంటిని కూడా కట్టుకున్నాడు.

ప్రస్తుతం కొన్ని షోలతో బిజీగా ఉన్న అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ వేడుకను కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు అందరికీ తెలిసిన విషయమే.

ఇక తాజాగా తనకు కాబోయే భార్య అనుజకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అవినాష్.ఇటీవల అవినాష్ తన పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు.అంతేకాకుండా ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా నిర్వహించారు.తన ప్రేయసి అనుజతో అవినాష్ రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చాడు.అయితే అవినాష్, అనుజ అలా ఇద్దరూ ప్రేమగా స్టిల్ ఇస్తుండగా మధ్యలోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి సరదాగా ఆట పట్టించింది.అవినాష్ – అనుజ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ అండగా అప్పుడే వచ్చిన శ్రీముఖి హ్యాపీ బర్త్ డే అవినాష్, హ్యాపీ బర్త్ డే అనుజ అంటూ నవ్వుతూ సరదాగా ఆట పట్టించింది.

మళ్లీ ఆ తర్వాత బిజీగా ఉన్నారా అంటూ కొంటెగా కౌంటర్ వేసింది శ్రీముఖి.

Telugu Anuja, Avinash, Avinash Birth Day, Biggboss, Jabardasth, Marrege, Photoshoot, Social Media, Sreemukhi-Movie

ఇక శ్రీముఖి, అవినాష్ ఇద్దరూ మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే.వివిధ షోలల్లో కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు.బిగ్ బాస్ లోకి వెళ్లేముందు జబర్దస్త్ నిర్వాహకుల నుంచి NOC తీసుకునేందుకు అవినాష్ గట్టిగా ప్రయత్నం చేశాడు.

జబర్దస్త్ నిర్వాహకులకు లక్షల్లో డబ్బు కట్టాల్సివచ్చింది.ఇక అప్పుడు శ్రీముఖి, అవినాష్‌కు ఫినాన్షియల్ అండగా నిలిచింది.

ఆమె చేసిన సహాయాన్ని అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు కూడా.ఇక అవినాష్ పెళ్లిలో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#Marrege #Biggboss #Avinash #Sreemukhi #Anuja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు