ఏడేళ్ల సంపాదనతో ఇల్లు కొన్న ముక్కు అవినాష్.. ఇల్లు ఎలా ఉందో చూశారా?

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఈ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.

 Avinash Bought A House With Seven Years Of Earnings Details,  Avinash, Comedian,-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న అవినాష్ గత కొన్ని నెలల క్రితమే ఒక ఇంటి వాడయ్యాడు.

అవినాష్ అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

వివాహం తర్వాత తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు, రీల్స్, ఫోటో షూట్ లు అంటూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన హోమ్ టూర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో ముక్కు అవినాష్ తన ఇంటిని తన స్కూల్ స్నేహితుడు జగదీష్ అనే వ్యక్తి డిజైన్ చేశారని ఈ సందర్భంగా తన ఇంటిలో ప్రతి అణువును వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు.

ఇక మూడు పడక గదులు కలిగిన ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయించానని అవినాష్ తన ఇంటిని మొత్తం చూపించడమే కాకుండా తనకు వచ్చిన బహుమతులు, అవార్డులను కూడా అభిమానులతో పంచుకున్నారు.అలాగే భవిష్యత్తులో వారికి పుట్టబోయే పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బెడ్రూమ్ తయారు చేయించినట్లు ఈ వీడియోలో అవినాష్ తెలిపారు.ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రూపాయి పోగుచేసి అవినాష్ ఎంతో అందమైన ఇంటిని నిర్మించుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ మీ జంట మాదిరిగానే మీ ఇల్లు కూడా ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube