ఆ బిగ్‌ బాస్ కంటెస్టెంట్ పుట్టినరోజు సందర్భంగా రచ్చ రచ్చ చేసిన అవినాష్ - ఆరియానా..!

బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా రియాలిటీ షో బిగ్ బాస్.ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంతో మంది మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

 Avinash Ariana Who Made A Fuss On The Occasion Of The Birthday Of That Bigg Boss-TeluguStop.com

ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో అరియానా కూడా ఒకటి.హౌస్ లో మొదటి నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచిన అరియానా, ఆట చివరి వరకు ఉండి, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం అరియానా కు పలు ఆఫర్లు రావడంతో పాటు, సినిమాలలో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి.తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్  రోల్ రిడా పుట్టినరోజు సందర్భంగా అరియానా వేడుకలలో పాల్గొనింది.

వీరిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో అరియానా తోపాటు అవినాష్ కూడా పుట్టినరోజు వేడుకలలో సందడి చేశారు.వీరందరూ కలిసి  రోల్ రిడాతో కేక్ కట్ చేయించడంతో పాటు, డీజే లో మాస్ స్టెప్పులు వేస్తూ ఇరగదీశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు అరియానా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకలకుంది.

రోల్ రిడా మంచి రాపర్ గా పేరు సొంతం చేసుకున్న వారిలో ఒకరు.

హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా ర్యాప‌ర్‌ గా కొనసాగిస్తున్నాడు.రోల్ రిడ అతి త్వరలోనే సినిమాలలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమాలో రోల్ రిడ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

అంతే కాకుండా అదే సినిమాలో అరియనా కూడా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాతో అటు అరియనా, ఇటు రోల్ రైడ మంచి పేరును సంపాదించుకుంటారో లేదో వేచి ఉండాల్సిందే.

ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫోర్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కూడా పాల్గొని ఇద్దరు పార్టీలో డాన్స్ లో చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube