ప్రేమ, పెళ్లి గురించి గుట్టు విప్పిన చిన్నారి పెళ్ళికూతురు . ఏం చెప్పిందంటే?

చిన్నారి పెళ్లికూతురు అనగానే అందరికీ గుర్తొచ్చే క్యారెక్టర్ ఆనంది.అప్పట్లోనే ఒక సినిమా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నది ఆ సీరియల్.

 Avika Gor Who Talks About Love And Marriage, Avika Gor, Marriage, Chinnari Pelli-TeluguStop.com

చిన్న వయసులోనే ది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగి.ప్రస్తుతం సినిమా రంగంలో తన సత్తా చాటుకున్న వర్ధమాన నటి అవికా గోర్.

సీరియల్ తో ప్రారంభమైన తన కెరీర్ లో ఉయ్యాలా జంపాలా మూవీ బెస్ట్ గా నిలిచిందని చెప్పవచ్చు.అలా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు అవికా గోర్.

మామూలుగానే సెలబ్రిటీల పెళ్లి, లవ్ ఇలాంటి విషయాలపై అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది.అలాగే అవికా గోర్ పెళ్లి ఎప్పుడు? తన జీవిత భాగస్వామి ఎవరు? అన్న ప్రశ్నలకు తానే ఒక చక్కని క్లారిటీని ఇచ్చారు.అసలు ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అవికా గోర్, మిలింద్ చంద్వానీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్న అందరికీ తెలిసిందే.

దానిపై స్పందించిన అవికా గోర్.తన వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు.

Telugu Avika Gor, Chinnaripelli-Movie

మిలింద్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని, అతను పేద విద్యార్థులపై చూపించే ఆ ప్రేమ తనకెంతో నచ్చిందని ఆమె చెప్పారు.అంతే కాకుండా తాను నడిపే ఎన్జీఓ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం అందుతుందని, తనలో ఆ సాయం చేసే గుణం తనకు బాగా నచ్చాయని అవికా గోర్ తెలిపారు.అందుకే అతను తన లైఫ్ పార్ట్ నర్ గా చూస్ చేసుకున్నానని ఆమె వివరించారు.ముందుగా మదివాడ తేజశ్విని తనకు మిలింద్ ను పరిచయం చేశారని అవికా గోర్ తెలిపారు.

అందుకు తనకు థ్యాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఇక పెళ్లెప్పుడు అనే దానిపై గతంలో మిలింద్ ఎప్పుడు పెళ్లికి రెడీ అంటే అప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఈమె ఇప్పుడైతే పెళ్లిపై ఎలాంటి అప్ డేట్ లేదని ఆమె స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube