హీరోయిన్, నిర్మాతగా ఒకే సారి రెండు సినిమాలు... అవికా గోర్ అరుదైన ఫీట్

చిన్నారి పెళ్లికూతురుతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యి ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ అవికాగోర్. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మంచి ఫేంలోకి వచ్చి క్రేజీ హీరోయిన్ గా మారుతుందనే రేంజ్ కి ఇమేజ్ పెంచుకుంది.

 Avika Gor Turns Producer To Two Movies, Tollywood, Telugu Cinema, South Heroines-TeluguStop.com

కుర్ర హీరోలకి జోడీగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే బొద్దుగా మారిపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత తెలుగు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చి ముంబై వెళ్ళిపోయి అక్కడ స్లిమ్ గా మారి మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది.వెంటనే ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 2లో నటించే అవకాశం పట్టేసింది.

ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అవికాగోర్ ని మళ్ళీ ఎవరూ పట్టించుకోలేదు.మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా ఒక సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుందనే టాక్ వచ్చిన అది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అవికాగోర్ రెండు రోజుల వ్యవధిలో రెండు చిన్న సినిమాలు హీరోయిన్ గా స్టార్ట్ చేసింది.యువ హీరో సాయిరోనక్ తో ఒక సినిమాలో నటిస్తుంది.

మరో సినిమా అనురాగ్ కొనెదల అనే యువ హీరోతో నటిస్తుంది.ఈ రెండు సినిమాలు లో బడ్జెట్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

అనురాగ్, అవికా జంటగా నటిస్తున్న సినిమాతో సత్యం ద్వారపూడి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక ఈ రెండు సినిమాలకి అవికా గోర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది.

పూర్తి స్థాయి నిర్మాతగా కాకపోయిన అవికా స్క్రీన్ క్రియేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమాలపై పెట్టుబడి పెడుతుంది.దీంతో టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో తాను హీరోయిన్ గా నటిస్తూ నిర్మాతగా చేస్తున్న హీరోయిన్ గా అవికా గోర్ పేరు గట్టిగా వినిపిస్తుంది.

అసలు హీరోయిన్స్ నిర్మాతగా మారి పెట్టుబడులు పెట్టె సాహసం చేయరు కాని అసలు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ లేకుండానే అవికాగోర్ ఈ సాహసం ఇప్పుడు చేయడం టాలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube