ముచ్చ‌ట‌గా మూడోసారి?

రాజ్ త‌రుణ్‌, అవికాగోర్ పేర్లు చెప్ప‌గానే ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ సినిమాలు ఠ‌పీమ‌ని గుర్తుకొస్తాయి.అచ్చ‌మైన గోదావ‌రి యాస గ‌ల కుర్రాడు, చిన్నారి పెళ్ళి కూతురు క‌లిసి మెప్పించిన సినిమాలు ఆ రెండూ.

 Avika To Romance With Raj Tarun For Third Time-TeluguStop.com

ఈ జంట మ‌ర‌లా ఇంకో సారి తెర‌మీద క‌నువిందు చేయ‌నుంద‌ని వినికిడి.విష్ణు మంచు, రాజ్ త‌రుణ్ క‌లిసి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో విష్ణు మంచు స‌ర‌స‌న అమైరా ద‌స్తూర్‌ని అనుకుంటున్నారు.

రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న అవికాగోర్‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది.అవికా కాల్షీట్ స‌ర్దుబాటు చేస్తే ఈ ఇద్ద‌రు క‌లిసి చేసే మూడో సినిమా అవుతుంది.

అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న సినిమా ఇది.వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.త‌ప్ప‌కుండా యువ‌త‌ను అల‌రించే హాస్య‌భ‌రిత‌మైన సినిమాగా రూపొందించ‌డానికి నాగేశ్వ‌ర‌రెడ్డి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వినికిడి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube