నాగచైతన్యతో రొమాన్స్ చేయబోతున్న అవికాగౌర్

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అవికాగౌర్.చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన ఈ నటి హీరోయిన్ గా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తరువాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.సినిమా చూపిస్త మామా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అవికా తరువాత కూడా అవకాశాలు బాగానే అందిపుచ్చుకుంది.

 Avika Gor Romance With Naga Chaitanya, Tollywood, Telugu Cinema, Director Vikram-TeluguStop.com

అయితే ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టకపోవడంతో బొద్దుగా తయారైంది.ఈ కారణంగా అవకాశాలు మెల్లగా దూరమయ్యాయి.అయితే తెలుగు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చి ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది.అదే సమయంలో బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది.

అయితే అక్కడ యధావిధిగా సీరియల్స్ తప్ప సినిమాలలో అవకాశాలు రాలేదు.దీంతో మళ్ళీ తనకు తెలుగు సినిమానే ముద్దు అనుకుంటూ ఇక్కడ వాలింది.

స్లిమ్ అయిన తర్వాత ఓంకార్ రాజుగారి గది3లో అవకాశం ఇచ్చాడు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.

దీంతో ఈ అమ్మడుని ఎవరూ పట్టించుకోరని అందరూ అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఇప్పుడు ఏకంగా నాగ చైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని అవికాగౌర్ సొంతం చేసుకుంది.

నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు.థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో చైతూ రొమాన్స్ చేయబోతున్నాడు.

అందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకుంటున్నారు.సెకండ్ హీరోయిన్ గా అవికాగౌర్ పేరు గట్టిగా వినిపిస్తుంది.ఇక మూడో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది.అవికాకి ఈ సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం అది బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి.

ఇది ఎంత వరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube