చిరు చిన్న అల్లుడుతో రొమాన్స్ చేయబోతున్న చిన్నారి పెళ్లి కూతురు  

Avika Gor Romance With Kalyan Dev - Telugu, Mega Family, Megastar, Telugu Cinema, Tollywood

చిన్నారి పెళ్లి కూతురు అనే హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ అవికా గొర్.ఆ తరువాత అదే క్రేజ్ తో ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సక్సెస్ అందుకున్న ఈ ముంబై పిల్ల తరువాత కొంత కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా కుర్ర హీరోలతో ఆడిపాడింది.

 Avika Gor Romance With Kalyan Dev - Telugu, Mega Family, Megastar, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

అయితే షేప్ అవుట్ అయిపోవడంతో దర్శకులు ఈ అమ్మడుని పక్కన పెట్టారు.ఇతర ముంబై భామల తరహాలో గ్లామర్ పాత్రలకి సెట్ కాకపోవడం కూడా అవికా మైనస్ అని చెప్పాలి.

ఇదిలా ఉంటే కొంత కాలం పాటు తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ లో ట్రై చేసిన ఈ అమ్మడుని అక్కడ పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు.దీంతో కాస్తా లుక్, మార్చుకొని బాడీ షేప్ మార్చుకొని ఈ సారి మరింత గ్లామర్ గా రంగంలోకి దిగింది.

చిరు చిన్న అల్లుడుతో రొమాన్స్ చేయబోతున్న చిన్నారి పెళ్లి కూతురు - Avika Gor Romance With Kalyan Dev - Telugu, Mega Family, Megastar, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

వచ్చి రావడంతోనే తన గ్లామర్, హాట్ ఫోటోషూట్ లతో దర్శకులకి సిగ్నల్ పంపించింది.ఇక ఈమె ప్రయత్నాలు మొత్తానికి ఫలించాయి.ఊహించని విధంగా ఏకంగా చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ తో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.ప్రస్తుతం సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ దేవ్ నెక్స్ట్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అవికా గొర్ ని ఫైనల్ చేసుకున్నారు.మరి ఈ సినిమా అమ్మడుకి ఎంత వరకు బ్రేక్ ఇస్తుంది అనేది చూడాలి.

తాజా వార్తలు

Avika Gor Romance With Kalyan Dev Related Telugu News,Photos/Pics,Images..