సినిమా అవకాశాల కోసం తగ్గలేదు అంటున్న అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు వాళ్ళకి పరిచయం అయిన నార్త్ ఇండియన్ బ్యూటీ అవికాగోర్ తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత తరువాత రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామా సినిమాతో రెండో హిట్ ని ఖాతాలో వేసుకొని యంగ్ హీరోలకి సరైన జోడీగా మారిపోయింది.

 Avika Gor Reveals Weight Loss Reasons-TeluguStop.com

దీంతో ఆరంభంలో భాగానే అవకాశాలు వచ్చాయి.అయితే భాగా బొద్దుగా మారిపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత ఓ రెండేళ్ళ పాటు టాలీవుడ్ కి దూరమై భాగా స్లిమ్ అయ్యి మళ్ళీ రాజుగారి గది3 మూవీతో అడుగుపెట్టింది.అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

 Avika Gor Reveals Weight Loss Reasons-సినిమా అవకాశాల కోసం తగ్గలేదు అంటున్న అవికా గోర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయిన కూడా సెకండ్ ఇన్నింగ్ లో ఈ అమ్మడు ఏకంగా చేతిలో నాలుగు సినిమాలతో మంచి జోరు చూపిస్తుంది.అందులో ఆది సాయి కుమార్ కి జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది.

అలాగే నాగ చైతన్యకి చెల్లిగా కూడా కనిపించబోతుంది.మరో వైపు ఆమె నిర్మాతగా మారి రెండు సినిమాలు స్టార్ట్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.సౌత్ లో హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

జీరో సైజ్ అనేది దక్షిణాదిలో అస్సలు ట్రెండ్ కాదని, అయితే బరువు సమస్య అని గతంలో నేను భావించలేదని, సినిమా అవకాశాల కోసం స్లిమ్ అయ్యాను అనేది అస్సలు వాస్తవం కాదని పేర్కొంది.కేవలం ఆరోగ్యం కాపాడుకోవడం కోసమే సన్నబడ్డానని తెలిపింది.

అలాగే నచ్చిన ఫుడ్ తింటూనే వర్క్ అవుట్స్ చేసి సన్నాగా అయ్యానని దీనికోసం కాస్మోటిక్స్ వాడలేదని పేర్కొంది.

#SouthIndian #South Audiance #Avika Gor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు