చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అవికా గోర్ (Avika Gor).ఈ సీరియల్లో బాలనటిగా ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె అనంతరం హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున (Nagarjuna)నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల(Uyyala Jampala) సినిమా ద్వారా హీరోయిన్ గా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు తెలుగు సినిమా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు పొందారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు పెద్దగా రాలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా నెపోటిజం (Nepotizam) ఉందని ఈమె కామెంట్స్ చేశారు.
సౌత్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోల పవర్ పైనే నడుస్తుందంటూ కామెంట్స్ చేశారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి కూడా ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉంది.
మరి కొద్ది రోజులలో అది కనపడకపోవచ్చు అంటూ ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో పలువురు ఈమె పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ.సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం బాలీవుడ్ కి వెళ్లారు.
అయితే అక్కడ అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ అవికా గోర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.