చిన్నారి పెళ్లికూతురును దురదృష్టం వెంటాడుతోందా..?

హిందీలో బాలికా వధు పేరుతో కలర్స్ ఛానల్ లో ప్రసారమైన సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్. ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళికూతురు పేరుతో అనువాదమైంది.

 Avika Gor Not Getting Offers In Bollywood, Bollywood, Salman Khan, Antim Movie,-TeluguStop.com

ఈ సీరియల్ ద్వారా అవికా గోర్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.ఈ సినిమా తర్వాత అవిక తెలుగులో చాలా సినిమాల్లో నటించినా సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మాత్రమే బాక్సాఫిస్ దగ్గర హిట్ అయ్యాయి.

అయితే నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం, స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడంతో అవికా గోర్ టాలీవుడ్ కు దూరమైంది.అయితే బాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ ఛాన్స్ ల కోసం అవికా గోర్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కుతున్న ఆంటమ్ సినిమాలో అవికా గోర్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి.సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రంలో అవికాకు ఛాన్స్ రావడంతో ఆమె దశ తిరిగినట్టే అని అందరూ భావించారు.

Telugu Antim, Avika Gor, Avikagor, Bollywood, Salman Khan, Uyyala Jampala-Movie

అయితే చిన్నారి పెళ్లికూతురును దురదృష్టం వెంటాడిందని ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారని తెలుస్తోంది.మరో బాలీవుడ్ భామను ఈ సినిమాలో ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది.ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న అవికా గోర్ ఇప్పుడు అవకాశాలు లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.ఇప్పటికీ టాలీవుడ్ కు దూరమైన అవికాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.

ఒక దశలో బరువు పెరిగిన అవికా గోర్ మళ్లీ ఎంతో కష్టపడి బరువు తగ్గారు.బరువు పెరిగిన సమయంలో అవకాశాలు దక్కించుకున్న అవిక బరువు తగ్గిన తరువాత మాత్రం కొత్త అవకాశాలను దక్కించుకోలేక పోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube