అతను ఎప్పుడంటే అప్పుడు పెళ్ళికి రెడీ అంటున్న అవికా గోర్

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన చిన్నారి పెళ్ళికూతురు ఫేం అవికా గోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఏకంగా చేతిలో నాలుగు సినిమాలని పెట్టుకొని ఫుల్ బిజీగా ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్ లో హీరోయిన్ గా జోరు చూపిస్తుంది.

 Avika Gor Opens Up On Wedding Plans With Boyfriend Milind, Tollywood, South Cine-TeluguStop.com

బొద్దుగుమ్మగా పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు కంప్లీట్గా స్లిమ్ లుక్ లోకి మారిపోయి అందరిని మెస్మరైజ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పటికే ఒకరితో లవ్ లో ఉన్న విషయాన్ని గతంలోనే రివీల్ చేసింది.

హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ఆమె ప్రేమలో ఉంది.హిందీలో రోడీస్‌ 17 కంటెస్టెంట్‌ వచ్చిన మిలింద్‌ ఓ ఎన్‌జీవో సంస్థను నడుపుతున్నాడు.

ఈ క్రమంలో ఓ ఎన్జీవో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమికుడు గురించి ఆసక్తికర విషయాలని పంచుకుంది.

నేను మిలింద్‌ను హైదరాబాద్‌లో కలుసుకున్నాను.ఓ ఎన్జీవో కోసం పనిచేస్తున్న క్రమంలో అక్కడే ఫస్ట్‌టైం చూశాను.తొలిచూపులోనే అతడికి ఇంప్రెస్‌ అయ్యా.అయితే నేను మొదటి చూపులోనే అతన్ని ప్రేమించలేదు.

ఒకరిని గురించి ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాక మా ప్రేమను వ్యక్తం చేసుకున్నాం.మా లవ్ స్టొరీ దక్షిణాది సినిమా ప్రేమకథలా ఉంటుంది.

ఇక పెళ్లి విషయంలో అతని నిర్ణయమే ఫైనల్ ఇంకా నాకు పెళ్లి వయసు రాలేదు.కానీ మిలింద్‌ చేసుకుందామని అడిగితే దానికి నేను రెడీగా ఉన్నాను.

తను రేపే పెళ్లి చేసుకుందామన్నా కూడా అందుకు నేను సిద్దం అని అవికా పేర్కొంది.ఈమె మాటల బట్టి మిలింద్ ని అవికా ఎంతగా ప్రేమిస్తుందో అర్ధమవుతుంది.

మొత్తానికి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా వచ్చిన ఈ బ్యూటీ ఏకంగా తెలంగాణ కోడలు అవ్వబోతుందని మాత్రం అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube