అవికా గోర్ నిజంగానే అతన్ని పెళ్ళి చేసుకుందా..?

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగులో మొదటి సినిమా చేసింది.ఈ సినిమాతో హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

 Avika Gor Getting Married, Avika Gor, Adil Khan, Social Media, Viral News, Adik-TeluguStop.com

ఈ సినిమా హిట్ తో వరుస ఆఫర్లకు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్త మామ, లక్ష్మి రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాల్లో నటించింది.

అయితే తాజాగా ఈ అమ్మడు రహస్యంగా పెళ్లి చేసుకుందని రెండు రోజులుగా మీడియాలో వినిపిస్తుంది.అందుకు కారణం కూడా లేకపోలేదు.అవికా గోర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చర్చిలో ఉన్న పెళ్లి ఫోటోను షేర్ చేసింది.ఆ ఫోటో వల్ల అందరు అవికా గోర్ రహస్యంగా చర్చిలో పెళ్లి చేసుకుందని అనుకున్నారు.

ఈ వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటో చుసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.మరికొంత మంది ఎప్పుడు పెళ్లి జరిగింది అని అవికా గోర్ ని అడుగుతున్నారు.అయితే అవికా గోర్ షేర్ చేసిన పెళ్లి ఫోటో వెనుక ఒక రహస్యం ఉంది.

ఆమె నిజంగా పెళ్లి చేసుకోలేదట.ఇది కేవలం షూటింగ్ లో భాగమని ఆలస్యంగా బయట పడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అందరు ఈ పెళ్లి ఫోటో నిజమే అని అనుకున్నారు.కానీ తీరా ఇది కాస్త లొకేషన్ లో ఫోటో అని తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే అవికా గోర్, ఆదిల్ ఖాన్ ఇద్దరు కాదిల్ అనే సాంగ్ లో నటించారు.ఈ పాట కోసమే చర్చిలో పెళ్లి ఫోటోలు తీశారు.

ఈ పాట త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అవికా గోర్ ఈ పాటకు సంభందించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.అసలు విషయం చెప్పకుండా అవికా తన ఖాతాలో హార్ట్ సింబల్ పెట్టి మరి ఈ ఫోటో షేర్ చేయడంతో నిజంగానే పెళ్లి చేసుకుందని అంత అనుకున్నారు.

ఏది ఏమైతేనేం సాంగ్ కు కావలిసినంత ప్రొమోషన్ అయితే జరిగిందనే చెప్పుకోవాలి.

https://www.instagram.com/p/CM4tLURAXxS/

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube