నాన్న వయసువాడు.. అతనితో ఎఫైర్ ఏంటి? అవికా గోర్!

అవికా గోర్ అనే పేరు కంటే చిన్నారి పెళ్ళికూతురు ఆనంది అనే పేరు తెలుగు, హిందీ అభిమానులకు ఎక్కువ టచ్ లో ఉంటుంది.2008లో హిందీలో ప్రసారమైన బాలికా వధు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అవికా గోర్.ఈ సీరియల్ డబ్బింగ్ తో స్టార్ మాలో చిన్నారి పెళ్ళికూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ సీరియల్ తో అవికా బాల నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Avika Gor Fire Secret Child Rumours Manish-TeluguStop.com
Telugu Avika Gor, Child Rumours, Manish, Uyyala Jampala-Movie

అలా బాలీవుడ్ బుల్లితెరలో పలు సీరియల్ లో నటించింది.ఇక టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.ఇక ప్రస్తుతం మరో సినిమాలో అవకాశం అందుకోగా అందులో యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది అవికా.ఇదిలా ఉంటే తన నాన్న వయసున్న అతనితో ఎఫైర్ ఏంటని మండిపడుతుంది.

 Avika Gor Fire Secret Child Rumours Manish-నాన్న వయసువాడు.. అతనితో ఎఫైర్ ఏంటి అవికా గోర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ససురాల్ సిమర్ కా అనే సీరియల్ లో నటించినప్పుడు తనతో పాటు మరో నటుడు మనీష్ రాయి సింఘన్ కూడా నటించాడు.ఇక వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని.

పైగా వీళ్లు సీక్రెట్ గా ఓ బిడ్డను కూడా కన్నారని తెగ వార్తలు వినిపించాయి.ఇక వీటి గురించి స్పందించిన అవికా.తాము ఓ బిడ్డను కన్నామని, సీక్రెట్ గా ఉంచామని అంటున్నారన్న ఈ విషయం అవాస్తవమని తెలిపింది.

13 ఏళ్ల వయసులో తాను నటిగా అడుగు పెట్టినప్పుడు మనీష్ తనకు మంచి స్నేహితుడని తెలిపింది.తన జీవితంలో అతనికి ప్రత్యేక స్థానం ఉందని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది.ఇప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ గురించి అడుగుతున్నారని.కానీ ఆ విషయం గురించి ఏం చెప్పను అంటూ ప్రశ్నించింది.

Telugu Avika Gor, Child Rumours, Manish, Uyyala Jampala-Movie

అతడు తన తండ్రి వయస్సు కంటే చిన్నవాడని, నిజానికి తన నాన్న వయస్సు అని.తమ మధ్య సంబంధం ఉందని వచ్చిన కథనాలు తమ మీద ప్రభావం చూపించాయని తెలిపింది.ఇక తాము రెండు వారాలపాటు మాట్లాడకుండా ఉన్నారట.

ఇక అలాంటి పుకార్లు వస్తూనే ఉండటంతో అసలు దూరంగా ఉండటం లో అర్థం లేదనిపించిందట.ఇక అప్పటినుండి తాము మరింత క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోయారట.

ఇక తమ గాసిప్స్ గురించి వచ్చిన వార్తలను విని ఇప్పటికీ నవ్వుకుంటామని తెలిపింది అవికా.

#Manish #Uyyala Jampala #Child Rumours #Avika Gor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు