ప్రతి అడుగులోనూ తను నా వెంటే.. ప్రియుడి గురించి అవికా ఎమోషనల్ పోస్ట్?

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అవికాగోర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా ఈమె పలు సినిమాల్లో నటిస్తున్నారు.

 Avika Gor Emotional Post About Boyfriend By Saying He Is Always With Me, Avika G-TeluguStop.com

తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ చిత్రంలో కూడా ఈమె కీలక పాత్రలో సందడి చేయనున్నారు.కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ విధంగా నటిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె 2 సంవత్సరాల క్రితం తన ప్రియుడు మిలింద్ ను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఎప్పుడంటే అప్పుడు తనతో పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని ఈమె తన ప్రియుడు గురించి వెల్లడించారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ప్రియుడి గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ తన జీవితంలోకి మిలింద్ వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, మిలింద్ తనలో ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపారని తెలిపారు.

అతను లేకుండా నేను ఇంత చేసేదాన్ని కాదు నాలో ఎంతో ప్రోత్సాహం నింపి నన్ను ముందుకు నడిపిస్తున్నారు.

Telugu Avika Gor, Avikagor, Bollywood, Boyfriend-Movie

నేను వేసే ప్రతి అడుగులోనూ మిలింద్ తనతో ఉన్నాడని,అతను లేకపోతే తాను ఇదంతా చేసేదాన్ని కాదు అంటూ ఈ సందర్భంగా తన ప్రియుడి గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ఒకప్పుడు ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం ఎంతో నాజూగ్గా మారిపోయారు.

కెరియర్ పరంగా బిజీగా ఉన్న అవికా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూనే తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube