నాలుగు చోట్ల పెళ్లి కూతురు హవా !

తెలుగు లో ఉయ్యాలా జంపాలా కంటే ముందే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం అయిన అవికా గొర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో యమా బిజీ గా ఉంది.

ఖాళీ దొరికితే హిందీ సీరియల్స్ చేస్తూ మరొక పక్క సౌత్ లో క్రేజ్ పెంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది.

కన్నడ , తమిళ ,తెలుగు పరిశ్రమల్లో ఈమె వరసగా సినిమాలు చేస్తోంది.జీవీ ప్రకాష్ కుమార్ పక్కన హీరోయిన్ గా సెట్ అయ్యింది ఈమె.కన్నడ ఎంట్రీ కి కూడా టైం వచ్చేసింది.కేర్ అఫ్ ఫుట్ పాత్ 2 అనే సినిమాతో అవిక శాండల్ వుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

మరి ఒకవైపు తెలుగు, హిందీ భాషల్లో బిజీ గా ఉన్న అవిక కి తమిళ, కన్నడ లభించినవి మంచి అవకాశాలే అని చెప్పాలి.తెలుగు కన్నా కొంచెం లేట్ గానే అయినా అక్కడ కుడా అవకాశాలు లభిస్తున్నాయ్.

చిన్న వయసు నుంచే బిజీ గా మారిన ఈ సీరియల్ సుందరి ఒకే సారి నాలుగు ఇండస్ట్రీ లలో ఎలా ప్రయాణం సాగిస్తుందో చూడాలి.

Advertisement
యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం

తాజా వార్తలు