ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అవికా గోర్.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.దీంతో వరుసగా ఈ టాలీవుడ్ లో అవకాశాలు వచ్చి పడ్డాయి.అయితే తర్వాత ఈ భామ బొద్దుగుమ్మగా మారిపోవడంతో అవకాశాలు దూరం అయ్యాయి.
తాజాగా అవికా గోర్ రాజుగారి గది త్రీ సినిమాతో మరల రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో తాజాగా అవికా గోర్ మీడియా సెంటర్ వీడియో అల్లు అర్జున్ డాన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పిన, అతనిలా డాన్స్ చేసేవాడు తనకి భర్తలా రావాలని కోరుకుంటున్న అంటూ అవికా గోర్ ఆసక్తికర వాఖ్యలు చేసింది.అయితే అతనితో డాన్స్ చేయమంటే మాత్రం తన వల్ల కాదని చెప్పుకొచ్చింది.బన్నీ డాన్స్ చేస్తారా అని అడిగితే అయ్యో కాళ్లు విరగ్గొట్టుకోమంటారా అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది.అయితే త్వరలో శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేయబోతున్నట్లు తెలిపింది.అలాగే తెలుగు భాష నేర్చుకోవడం కూడా చాలా కష్టమని చెప్పింది.తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నాయని, మంచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకొని తన మార్కు చూపించడానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.